Malli Modalaindi: డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’.. ఎప్పుడు.. ఎందులో అంటే..?

సుమంత్ హీరోగా టీజీ కీర్తి కుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'మళ్ళీ మొదలైంది' చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Malli Modalaindi: డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సుమంత్ 'మళ్ళీ మొదలైంది'..  ఎప్పుడు.. ఎందులో అంటే..?
Malli Modalaindi
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 21, 2022 | 8:55 PM

Hero Sumanth: హీరో సుమంత్ కాస్త లేటుగా సినిమాలు చేసినప్పటికీ.. అతడు ఎన్నుకునే స్క్రిప్ట్స్ చాలా విభిన్నంగా ఉంటాయి. 2017 విడుదలైన ‘మళ్లీ రావా’ సినిమా సుమంత్ కెరీర్ లో మెమరబుల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత అతడికి మరో హిట్ పడలేదు. తాజాగా చేస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మళ్ళీ మొదలైంది’ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీని  నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో.. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారట. ఈ సినిమాను ‘జీ5’ ఓటీటీలో ఎక్స్​క్లూజివ్​గా రిలీజ్​ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓటీటీ రైట్స్​ను చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో సినిమాను ఓటీటీలో రిలీజ్​ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టీజీ కీర్తి కుమార్​ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

విడాకులు తీసుకున్న ఓ వ్యక్తి.. తన లాయర్ తో ప్రేమలో పడితే..? అనే స్టోరీ లైన్ తో  ‘మళ్ళీ మొదలైంది’ తెరకెక్కింది. ఈ సినిమాలో సుమంత్‌కు జోడీగా నైనా గంగూలీ కనిపించనుంది. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణి సౌందర్​ రాజన్​ నటించింది. ఈడీ ఎంటర్టైన్మెంట్​ బ్యానర్​పై రాజశేఖర్​ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్​ రూబెన్స్  మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్​లుక్​ క్యారెక్టర్​ పోస్టర్లు, టీజర్​, ట్రైలర్​ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Also Read:  గోవా టూర్ జ్ఞాప‌కాల‌ను నెటిజ‌న్ల‌తో పంచుకున్న స్నేహా రెడ్డి.. ఫ్రెండ్స్‌తో అల్లువారి సంద‌డే సంద‌డి..