Sneha Reddy: గోవా టూర్ జ్ఞాపకాలను నెటిజన్లతో పంచుకున్న స్నేహా రెడ్డి.. ఫ్రెండ్స్‌తో అల్లువారి సందడే సందడి..
Sneha Reddy: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వారిలో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఒకరు. అటు భర్త అల్లు అర్జున్ సినిమా అప్‌డేట్స్‌తో పాటు, ఇటు కుటుంబానికి సంబంధంచిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకోవడం...
Sneha Reddy: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వారిలో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఒకరు. అటు భర్త అల్లు అర్జున్ సినిమా అప్‌డేట్స్‌తో పాటు, ఇటు కుటుంబానికి సంబంధంచిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకోవడం స్నేహ రెడ్డికి అలవాటు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ సెలబ్రిటీ భార్యకు సాధ్యం కానీ రెయిర్ ఫీట్‌ను సాధించింది. ఏకంగా 6.9 మిలియన్ల ఫాలోవర్లతో స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా స్నేహరెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను తెర ఆకట్టుకుంటోంది. 2021లో కొంత మంది స్నేహితులతో కలిసి అల్లు వారి ఫ్యామిలీ గోవా ట్రిప్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌తో పాటు భార్య స్నేహా రెడ్డి కొందరు స్నేహితులు హంగామా చేశారు. గోవా ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలతో రూపొందించిన వీడియోను స్నేహా రెడ్డి పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోతో పాటు రాత్రులు ఉదయాలుగా మారాయి, స్నేహితులు కుటుంబ సభ్యులుగా మారారు అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ రాసుకొచ్చింది స్నేహ.
మరీ ముఖ్యంగా పుష్పతో బన్నీ నార్త్ ఇండియాలోనూ పాగా వేయడంతో అక్కడి మీడియా సంస్థలు కూడా స్నేహా రెడ్డి పోస్టులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ కథనాలు రాయడం విశేషం. మరి నెట్టింట వైరల్‌గా మారిన అల్లు అండ్ ఫ్రెండ్స్ గోవా ట్రిప్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి..
View this post on Instagram
ఇదిలా ఉంటే పుష్ప తొలి పార్ట్‌తో సంచలన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పుష్ప పార్ట్ ది రూల్ చిత్రీకరణ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మొన్నటి వరకు సౌత్ ఇండియాకు పరిమితమైన బన్నీ మార్కెట్ పుష్పతో ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలుగుతో పాటు విడుదలైన అన్నిభాషల్లో సంచలన విజయం సాధించిన పుష్ప భారీ వసూళ్లు రాబట్టింది.
Also Read: Tesla: లైన్ క్లియర్.. కానీ షరతులు వర్తిస్తాయి.. టెస్లాకు కేంద్రం ఆఫర్..!
Akkineni Nagarjuna: స్వామివారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున.. రెండేళ్ల తర్వాత..
Diabetes: డయాబెటిస్ ఉన్నవారు పండ్లు ఏ సమయంలో తినాలి.. ఎలాంటివి తింటే మంచిది..