Tesla: లైన్ క్లియర్.. కానీ షరతులు వర్తిస్తాయి.. టెస్లాకు కేంద్రం ఆఫర్..!
Central Government on TESLA: కార్ల కంపెనీ టెస్లా.. భారత్‌కు వస్తుందా? రాదా? ఇప్పటికే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ కార్ల కంపెనినీ ఆహ్వానిస్తూ
Central Government on TESLA: కార్ల కంపెనీ టెస్లా.. భారత్‌కు వస్తుందా? రాదా? ఇప్పటికే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ కార్ల కంపెనినీ ఆహ్వానిస్తూ దేశంలోని పలు రాష్ట్రాలు ప్రకటనలు సైతం చేశాయి. ఇప్పుడు, ఈ అంశానికి సంబంధించి ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపుతోంది. దీనిపై కేంద్రవర్గాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు, ఎలన్ మస్క్‌కు కేటీఆర్ చేసిన ట్వీట్.. మరో చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం టెస్లా ముందు కొన్ని షరతులను ఉంచిన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ షరతులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రభుత్వ మేకిన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా భారత్‌లో తప్పనిసరిగా తయారీ చేపట్టాలని కేంద్రం టెస్లాను డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే పన్ను ప్రయోజనాలను కల్పించే ముందు భారత్‌లో కంపెనీ భవిష్యత్తు పెట్టుబడుల ప్రణాళికలపై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు తయారీ కేంద్రం ఏర్పాటు కంటే ముందు ముడిపదార్థాల కొనుగోలును పెంచుతామన్న టెస్లా ఆఫర్‌పై సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై టెస్లా ఆశలు పెట్టుకున్నట్లు వార్తలు వైరల్ కూడా అవుతున్నాయి.
అయితే.. తెలంగాణ, పంజాబ్, కర్ణాటక సహా పలు కీలక రాష్ట్రాలు కార్ల కంపెనీ అధినేత అయిన మస్క్‌ను ఆహ్వానించాయి. ఈ క్రమంలోనే కేంద్రం కూడా మస్క్‌కు కొన్ని షరతులు విధించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీడిపై కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
Also Read: