Viral Video: ఇక్కడ బేరాలు లేవమ్మా.. కోతి కూరగాయల యాపారం మామూలుగా లేదుగా..

కోతులు ఆటలు ఆడటమే కాదండోయ్.. పాటలు పాడుతున్నాయి.. ఫైటింగ్ చేస్తున్నాయి.. ఒక్కటేమిటి మనం చేసే ప్రతి పనిలో పోటీ పడుతున్నాయి. తాజాగా..

Viral Video: ఇక్కడ బేరాలు లేవమ్మా.. కోతి కూరగాయల యాపారం మామూలుగా లేదుగా..
Viral Video Shows Monkey Selling
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 21, 2022 | 12:48 PM

Monkey Selling Viral Video: ఈ రోజుల్లో కోతులు ఆటలు ఆడటమే కాదండోయ్.. పాటలు పాడుతున్నాయి.. ఫైటింగ్ చేస్తున్నాయి.. ఒక్కటేమిటి మనం చేసే ప్రతి పనిలో పోటీ పడుతున్నాయి. తాజాగా ఓ కోతి కూరగాయలు అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ అన్ని సామాజిక మద్యాలమాల్లో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. వైరల్‌గా మారిన ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాకు చెందినది. ఈ వీడియో చూస్తే మొదటి కోతి కూరగాయలు అమ్ముతున్నట్లు అనిపిస్తుంది. దుకాణదారు వెళ్లిన తర్వాత కోతి స్వయంగా కూరగాయల దుకాణం వద్ద కూర్చున్నట్లు అర్థమవుతుంది. ఈ దృశ్యాన్ని చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా యూజర్లు కూడా వీడియోపై తమదైన తరహాలో స్పందిస్తున్నారు. నడిరోడ్డుపై కూరగాయల దుకాణం వద్ద కోతిని చూసిన జనం ముందుగా షాక్ అయ్యారు. కోతి కౌంటర్ వద్ద ఉంటే కూరగాయలు ఎలా కొనేది బాబు..! అంటూ ప్రశ్నిస్తున్నారు. దానితో బేరసారాలకు ఇబ్బంది పడతాడని ఒకరు కామెంట్ చేశారు.

వైరల్ అవుతున్న వీడియోలో, కోతి దుకాణంలో హాయిగా కూర్చుని కూరగాయలు తింటున్నట్లు మీరు చూడవచ్చు. దుకాణదారుడు కాసేపటికి ఎక్కడికో వెళ్లాడు.. ఇదే సరైన సమయం అనుకున్నట్లుంది. దొరికిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కోతి ఓనర్ స్థానంలో కూర్చుని తన పని తాను చేసుకుపోయింది.

దీన్ని చూస్తే కోతి కూరగాయల దుకాణం నడుపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది గమనించిన ఆ కూరగాయల అమ్మే వ్యక్తి పరుగు పరుగున రావడంతో అది అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలోని ప్రతి ప్లాట్‌ఫారమ్‌లో చాలా వేగంగా షేర్ చేయబడుతోంది. దీనిపై నెటిజనం కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు భారీగా షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: TTD: తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ.. ఈ ఏడు రోజులపాటు ఆర్జిత సేవ‌లు ర‌ద్దు..

Covid Claims: లెక్కలు తప్పుతున్నాయి.. కోవిడ్‌ మరణాలపై పరిశోధకుల అనుమానాలు..