AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: నిద్రలో కలవరించి అడ్డంగా బుక్కయిన మహిళ.. ఆమె రహస్యాలు విన్న భర్త ఏం చేశాడంటే..

Man reports wife: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరంటారు. అయితే.. ఆ దొంగ భార్య అయితే.. పట్టుకోవడం ఇంకా కష్టం. అలాంటి భార్యను

Crime News: నిద్రలో కలవరించి అడ్డంగా బుక్కయిన మహిళ.. ఆమె రహస్యాలు విన్న భర్త ఏం చేశాడంటే..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jan 21, 2022 | 12:02 PM

Share

Man reports wife: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరంటారు. అయితే.. ఆ దొంగ భార్య అయితే.. పట్టుకోవడం ఇంకా కష్టం. అలాంటి భార్యను ఓ వ్యక్తి నిద్రలో పట్టుకున్నాడు. అదేంటి నిద్రలో పట్టుకోవడం ఏంటి.. అని ఆలోచిస్తున్నారు.. కదా.. ఇది నిజం. భార్య కలగంటూ తాను చేసిన దొంగతనం గురించి చెప్పడంతో.. సీన్ కాస్త రివర్స్ అయింది. ఓ కేర్‌టేకర్ మహిళ.. తన యజమానురాలు దగ్గర డబ్బు దొంగిలించింది. ఈ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదు. అయితే.. ఓ నిద్రపోతూ కలవరించింది. చేసిన చోరీ గురించి కలలో మాట్లాడడటంతో భర్త విని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇంగ్లండ్ లంకాషైర్‌లో ఆంటోనీ, రూత్ ఫోర్ట్ దంపతులు . వారికి ముగ్గురు పిల్లలు. అయితే.. రూత్ ఫోర్ట్ ఓ కేర్ హోమ్ లో పనిచేస్తోంది. వీల్ చైర్లో ఉండే ఓ మహిళను జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని అది. ఆ మహిళ దగ్గర రూత్ ఫోర్ట్ £7,200 అంటే ఇండియన్ కరెన్సీలో రూ.7,29,000 దొంగతనం చేసింది. ఆ తర్వాత ఆంటోనీ ఫోర్ట్ డెబిట్ కార్డునూ, ఆమె పర్సునూ చెక్ చేశాడు. లక్షల కొద్దీ డబ్బు ఉన్నట్లు గుర్తించాడు. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పకుండా అమాయకురాలిలా ఫోర్ట్ నటించింది. అయితే.. నిద్రలో ఇదంతా చెప్పడంతో భర్త ఆంటోనీ విని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే.. ఆంటోనికి ఎప్పటినుంచో.. రూత్ ఫోర్ట్‌పై అనుమానం ఉంది. ఎందుకంటే.. మెక్సికోకి హాలిడేకి వెళ్లినప్పుడు ఆమె తన ముగ్గురు పిల్లలకూ వేలాది రూపాయలు ఖర్చు పెట్టిందని కోర్టులో తెలిపాడు. జీతం తక్కువగా వస్తుందని.. అంత డబ్బు ఎక్కడిదని పోలీసులకు తెలపడంతో.. దీనిపై విచారణ వేగవంతంగా జరిగింది. వృద్ధురాలితే సన్నిహితంగా ఉండే ఫోర్ట్.. ఆమె డెబిట్ కార్డును దొంగతనం చేసి.. డబ్బులను కాజేసింది.

అయితే.. కోర్టు విచారణలో ఆంటోని ఈ విషయాన్ని మళ్లీ చెప్పడంతో ఈ వార్త వైరల్ అయ్యింది. భార్య అంటే తనకు చాలా ప్రేమని.. అలాగని ఆమె చేసిన తప్పును క్షమించలేనంటూ చెప్పడంతో.. జడ్జి కూడా అతన్ని ప్రశంసించారంటూ పలు వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. 2018 చోరి ఘటనకు సంబంధించి కోర్టు ఆమెకు 16 నెలల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Also Read:

Republic Day: ఆంధ్రప్రదేశ్ కళాకారుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో కలంకారీ పెయింట్స్ ప్రదర్శన.

Nirmala Sitaraman: నిర్మలమ్మ బడ్జెట్‌కు తుది మెరుగులు.. నాలుగోసారి తెలుగింటి కోడలు ఘనత

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే