Viral News: మీ కంటి చూపుకు అగ్ని పరీక్ష.. ఈ ఫోటోలో ఎన్ని ఏనుగులు ఉన్నాయో చెబితే మీరే జీనియస్..

Viral News: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయంటారు. అవును ఒక్కోసారి మనం చూసే దానికి, వాస్తవ పరిస్థితులకు

Viral News: మీ కంటి చూపుకు అగ్ని పరీక్ష.. ఈ ఫోటోలో ఎన్ని ఏనుగులు ఉన్నాయో చెబితే మీరే జీనియస్..
Elephants
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 21, 2022 | 9:54 AM

Viral News: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయంటారు. అవును ఒక్కోసారి మనం చూసే దానికి, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. మన కళ్లకు కనిపించేది ఒకటైతే.. అక్కడ వాస్తవం మరొకటి ఉంటుంది. అందుకే కొంచెం ఆలోచించి, పూర్తి పరిజ్ఞానంతో వాస్తవాలను చూడాలని చెబుతుంటారు పెద్దలు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూసి వాస్తవం ఏంటో తెలుసుకోలేక చాలా మంది నెటిజన్లు పప్పులో కాలేశారు. మరి ఇంతకీ ఆ ఫోటో ఏంటి? ఆ ఫోటోలో ఏముంది? నెటిజన్లు ఎందుకు బోల్తా పడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద.. తాజాగా ఓ ఏనుగుల మందకు సంబంధించిన ఫోటోను ట్వీట్ చేశారు. అది ఇప్పుడు నెటిజన్ల బుర్రను చిందర వందర చేస్తోంది. ఆ ఫోటోలో ‘ఎన్ని ఏనుగులు ఉన్నాయో చెప్పాలి’ అటూ క్యాప్షన్‌తో నెటిజన్లను ప్రశ్నించారు. ఈ ఫోటోలో కొన్ని ఏనుగులు కొలను వద్దకు వచ్చి నీరు తాగుతున్నాయి. ఆ సమయంలో తీసిన ఫోటోను షేర్ చేసిన సుశాంత నంద.. ఎన్ని ఏనుగులు ఉన్నాయో చెప్పాలని సవాల్ విసిరారు. దీనికి స్పందించిన దాదాపు నెటిజన్లు అందరూ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే.. అందులో కనిపించకుండా మధ్య మధ్యలో గున్న ఏనుగు పిల్లలు కూడా ఉన్నాయి. పైకి చూడటానికి 5 మాత్రమే కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి మాత్రం 7 ఏనుగులు ఆ ఫోటోలో ఉన్నాయి.

‘‘ఏడు ఏనుగులు తమ దాహాన్ని తీర్చుకుంటుండగా.. ఈ ఫర్ఫెక్ట్ సింక్ ఫ్రేమ్‌ను పొందడానికి వైల్డ్ లెన్స్ ఏకో ఫౌండేషన్ 20 నిమిషాల్లో దాదాపు 1,400 ఫోటోలను తీసుకుంది.’’ అని సుశాంత నంద మరో క్యాప్షన్ కూడా పెట్టారు. ఆ తరువాత ఏనుగుల గుంపునకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో నాలుగు పెద్ద ఏనుగులు ఉండగా.. మూడు చిన్న ఏనుగు పిల్లలు ఉన్నాయి.

కాగా, సుశాంత నంద షేర్ చేసి పిక్.. ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఫోటోలో ఎన్ని ఏనుగులు ఉన్నాయనేది తేల్చడానకి నెటిజన్లు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. చాలా మంది ఆన్సర్ చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. మరి మీరైనా ఫోటోలో ఎన్ని ఏనుగులు ఉన్నాయో చూసి చెప్పగరా? అయితే ట్రై చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?