IND VS SA: రెండో వన్డేలోనూ చతికిలపడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..
దక్షిణాఫ్రికాతో ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్ ను సైతం సమర్పించుకుంది. బోలాండ్ పార్క్ వేదికగా రెండో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో భారతజట్టుపై
దక్షిణాఫ్రికాతో ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్ ను సైతం సమర్పించుకుంది. బోలాండ్ పార్క్ వేదికగా రెండో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో భారతజట్టుపై విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ ను 2-0 తో కైవసం చేసుకుంది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సులభంగా టార్గెట్ ను అందుకుంది. ఓపెనర్లు జానేమన్ మలన్ 91, క్వింటన్ డికాక్ 78 సౌతాఫ్రికా కు గట్టి పునాది వేయగా.. కెప్టెన్ తెంబా బవుమా (35) మరోసారి కీలక ఇన్నింగ్స ఆడాడు . ఇక చివర్లో మార్ర్కమ్ (35 నాటౌట్), డసెన్ (34 నాటౌట్) మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు. కాగా ఫ్లాట్ పిచ్ పై టీమిండియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఒక్కరు కూడా ప్రొటీస్ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు. టీమిండియా బౌలర్ల లో బుమ్రా, భువనేశ్వర్, చహల్ తలా ఒక వికెట్ తీశారు.
పంత్ మెరుపులు..
కాగా అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెన ర్లు శుభారంభం అందించారు. ధావన్(29), కేఎల్ రాహుల్(55) మొదటి వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యం అందించారు. వన్ డౌన్ లో కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగినప్పటికి రిషభ్ పంత్ ( 71 బంతుల్లో 85 పరుగులు) మెరుపులు మెరిపించాడు. అతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు ,రెండు సిక్స్ లు ఉన్నాయి. పంత్, రాహుల్ భాగస్వామ్యంతో ఒకానొక దశలో టీమిండియా భారీ స్కోరు దిశగా కనిపించింది. కానీ వారిద్దరితో పాటు శ్రేయస్ అయ్యర్ (11), వెంకటేశ్ అయ్యర్ (22) త్వరగా పెవిలియన్ చేరడంతో స్కోరు నెమ్మదించింది. అయితే మొదటి వన్డేలో అర్ధ సెంచరీ సాధించిన శార్దూల్ ఠాకూర్ ( 40 నాటౌట్ ) మరోసారి ఆకట్టుకోవడంతో టీమిండియా 287 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంసీ 2, మగల, మార్క్రమ్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. కీలక ఇన్నింగ్స్ తో సఫారీలకు శుభారంభం అందించిన ఓపెనర్ క్వింటన్ డికాక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇక సిరీస్ లో చివరి నామమాత్రపు వన్డే ఆదివారం జరగనుంది.
South Africa seal comfortable win to take unassailable lead in the series ??
Half-centuries from openers Janneman Malan and Quinton de Kock take them to a 2-0 series win! ??
Watch the series live on https://t.co/CPDKNxoJ9v (in select regions)#SAvIND | https://t.co/GgjKcxXNrB pic.twitter.com/MWeG1l4y6s
— ICC (@ICC) January 21, 2022
Also Read: HDFC Life Insurance: పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఆదాయం..!