Dolo 650: అందరి తల నొప్పిని తగ్గించే డోలో 650.. కంపెనీ వారి తలరాతను మార్చేసింది.. కాసుల వర్షం..
Dolo 650: కాస్త తల నొప్పిగా ఉన్నా.. జ్వరంలా ఉన్నా వెంటనే ఒక డోలో వేసుకో సరిపోతుంది అనే మాట వచ్చేస్తుంది. అంతలా ఈ ట్యాబ్లెట్ అందరికీ అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా కాలంలో డోలో 650కి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది...
Dolo 650: కాస్త తల నొప్పిగా ఉన్నా.. జ్వరంలా ఉన్నా వెంటనే ఒక డోలో వేసుకో సరిపోతుంది అనే మాట వచ్చేస్తుంది. అంతలా ఈ ట్యాబ్లెట్ అందరికీ అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా కాలంలో డోలో 650కి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. నిజానికి వైద్యుల సూచన లేకుండా ట్యాబ్లెట్ వేసుకోవడం మంచిది కాదనే విషయం తెలిసినా.. కొందరు యధేశ్చగా వాడుతున్నారు. ఇక కరోనా ట్రీట్‌మెంట్ కోసం వైద్యులు కూడా ఈ మాత్రను సీఫార్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే తాజాగా డోలో 650 ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కరోనా సమయంలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ట్యాబ్లెట్‌గా డోలో నిలిచింది.
2020లో కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఏకంగా 350 కోట్ల డోలో 650 మాత్రలు అమ్ముడుపోయాయి. ఈ మొత్తం ట్యాబ్లెట్లను పేర్చుకుంటే పోతే ఎవరెస్ట్ పర్వతం కంటే 6000 రెట్లు ఎక్కువ ఎత్తు ఉంటుందంట. అయితే కరోనాకు ముందు ఈ మెడిసిస్ సేల్స్ ఈ స్థాయిలో లేకపోవడం గమనార్హం. 2019లో భారత్‌లో 75 మిలియన్ స్ట్రిప్ల డోలో మాత్రలను విక్రయించగా.. ఒక్క 2021లోనే రూ. 307 కోట్ల టర్నోవర్ నమోదు కావడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ట్యాబ్లెట్స్‌లో కాల్‌పోల్ మొదటి వరుసలో ఉండగా.. రెండో స్థానంలో డోలో 650 నిలిచింది. ఇదిలో ఉంటే ఇటీవల డోలో 650 ట్యాబ్లెట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే.
Also Read: Vodafone idea: వొడాఫోన్ ఐడియా నుంచి వినియోగదారులు ఎందుకు వెళ్లిపోతున్నారు..? కారణం ఏమిటి..?
Rakul Preet Singh: రోడ్లపై చక్కర్లు కొడుతున్న టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.(ఫొటోస్)