Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vodafone idea: వొడాఫోన్‌ ఐడియా నుంచి వినియోగదారులు ఎందుకు వెళ్లిపోతున్నారు..? కారణం ఏమిటి..?

Vodafone idea:ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vodafone idea) కష్టాలు తగ్గడం లేదు. సంక్షోభ సమయాల్లో..

Vodafone idea: వొడాఫోన్‌ ఐడియా నుంచి వినియోగదారులు ఎందుకు వెళ్లిపోతున్నారు..? కారణం ఏమిటి..?
Follow us
Subhash Goud

|

Updated on: Jan 21, 2022 | 8:16 PM

Vodafone idea:ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vodafone idea) కష్టాలు తగ్గడం లేదు. సంక్షోభ సమయాల్లో కస్టమర్లు కంపెనీకి దూరమవుతున్నారు. నివేదికల ప్రకారం.. నవంబర్ 2021 లో కంపెనీ దాదాపు 19 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. కస్టమర్ల పరంగా గత 5 నెలల్లో కంపెనీకి ఇదే అతిపెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఈ 19 లక్షల మందిలో దాదాపు 12 లక్షల మంది వినియోగదారులు వోడాఫోన్ ఐడియాను విడిచిపెట్టిన గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు . దీనికి ప్రధాన కారణం సరైన నెట్‌వర్క్ సిగ్నల్ లేకపోవడమే కారణం. రిపోర్ట్ ప్రకారం.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ కంపెనీ గత ఏడాదిలో కేవలం 1.4 మిలియన్ల కొత్త 4జీ వినియోగదారులను మాత్రమే చేర్చుకుంది. ఈ సమయంలో ఎయిర్‌టెల్‌ (Airtel) 3.4 కోట్లు మరియు జియో (Jio) 20 మిలియన్ల వినియోగదారులను చేర్చుకుంది. గత వారంలో స్టాక్ 13 శాతానికి పైగా పడిపోయింది. అదే సమయంలో, స్టాక్ ఒక నెలలో -21 శాతం, 3 నెలల్లో 22 శాతం, ఒక సంవత్సరంలో 7 శాతం, 3 సంవత్సరాలలో -50 శాతం రాబడిని రాబడి వచ్చింది.

స్పెక్ట్రమ్ వేలం వాయిదాల బకాయిలు, ఏజీఆర్‌ (AGR) మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించడానికి బోర్డు సమావేశంలో కొత్త ప్రణాళికను అంగీకరించినట్లు వోడాఫోన్ ఐడియా స్టాక్ ఎక్స్ఛేంజీలు BSE, NSE లకు తెలియజేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ బకాయిలను కంపెనీ వాటాల ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తుంది. అంటే వోడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.86 శాతం వాటా ఉంటుంది.

టెలికాం పరిశ్రమలో నవంబర్ నెలలో స్వల్ప మెరుగుదల కనిపించింది. ఎయిర్‌టెల్ (Airtel) దాదాపు 13 లక్షలు, జియో (Jio) 20 లక్షల కస్టమర్ల వచ్చి చేరారు. ఈ వినియోగదారులలో ఎక్కువ మంది వోడాఫోన్ ఐడియా (Vodafone idea)కు గుడ్‌బై చెప్పిన వారే ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. కోటక్ ఈక్విటీస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. 2021 ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు జియో 42 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంది. అక్టోబర్‌లో ఈ సంఖ్య 18 లక్షలు కాగా, నవంబర్‌లో 20 లక్షలు ఉంది. భారతదేశంలో దాదాపు 118 కోట్ల మంది మొబైల్‌ను ఉపయోగిస్తున్నారు. దాదాపు 76 కోట్ల మంది ప్రజలు బ్రాడ్‌బ్యాండ్‌ను ఉపయోగిస్తున్నారు. వొడాఫోన్ ఐడియాకు దాదాపు 25 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2020తో పోలిస్తే కంపెనీ యూజర్లు దాదాపు 10 శాతం మేర తగ్గారు. ఇటీవల, భారత ప్రభుత్వం కూడా కంపెనీలో 35 శాతానికి పైగా వాటాదారుగా మారింది.

ఇవి కూడా చదవండి:

Budget 2022: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పనున్న కేంద్ర సర్కార్‌.. పెరగనున్న పీఎం కిసాన్‌ డబ్బులు..!

PM Svanidhi: మీ ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ లింకై ఉందా..? రూ.10వేల బెనిఫిట్‌ పొందవచ్చు.. ఎలాగంటే..!