Budget 2022: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పనున్న కేంద్ర సర్కార్.. పెరగనున్న పీఎం కిసాన్ డబ్బులు..!
Budget 2022: కేంద్ర సర్కార్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దేశ బడ్జెట్‌ను త్వరలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది...
Budget 2022: కేంద్ర సర్కార్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దేశ బడ్జెట్‌ను త్వరలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ (Budget 2022)లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రైతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman nidhi) కింద ప్రతి ఏడాది అందించే డబ్బులను రూ.6000 నుంచి రూ.8000 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇవి మాత్రమే డిమాండ్ ఆధారిత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలోని రైతులకు (Farmers)మేలు చేసేందుకు మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అన్ని పంటలకు కనీస మద్దతు..
ఈ బడ్జెట్‌లో అన్ని పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని రైతులు కొంత కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో డిమాండ్ చేసిన రైతుల డిమాండ్ కూడా ఇదే. ప్రకటించిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించి, ఎంఎస్‌పీపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
అలాగే సంప్రదాయ వ్యవసాయంతో పాటు ఆధునిక వ్యవసాయాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సంప్రదాయ వ్యవసాయ నుంచి రైతులు ఆధునిక వ్యవసాయం వైపుకి మరల్చేందుకకు అవసరమైన ప్రత్యేక ప్రకటనలను కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో చేయబోతోందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: