SBI Customer Alert: ఎస్బీఐ కస్టమర్లకు అలెర్ట్.. ఆరున్నర గంటల పాటు ఆన్‌లైన్ సేవలు బంద్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్ ప్రకటించింది. ఆన్ లైన్ సేవలు శనివారం(జనవరి 22)నాడు కొన్ని గంటల పాటు నిలిపివేయనున్నట్లు కస్టమర్లకు తెలియజేసింది.
SBI Technology Upgrade: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు ఆన్‌లైన్ సేవలకు సంబంధించి అంతరాయం ఎదుర్కోనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎస్బీఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఎస్బీఐ ఆన్ లైన్ సేవలు శనివారంనాడు (22 జనవరి) వేకువజామున కొన్ని గంటల పాటు నిలిపివేయనున్నట్లు శుక్రవారం ట్విట్టర్‌లో ప్రకటించింది. టెక్నాలజీ అప్ గ్రేడ్ కారణంగా జనవరి 22 తెల్లవారుజామున 2 గంటల నుంచి 8:30 గంటల మధ్య ఆన్ లైన్ సర్వీసులు నిలివేస్తున్నట్లు సూచించింది. దీంతో ఎస్బీఐకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో (Yono), యోనో లైట్ (Yono Lite), యోనో బిజినెస్ (Yono Business), UPI సేవలు అందుబాటులో ఉండవని ట్విటర్ ద్వారా పేర్కొంది.
మెరుగైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించేందుకు మేము ప్రయత్నిస్తున్నందున కస్టమర్లందరూ..ఈ అసౌకర్యానికి సహకరించవల్సిందిగా కోరుతున్నామని ఎస్బీఐ ఈ సందర్భంగా కస్టమర్లను కోరింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ గత కొంత కాలంగా మరింత సురక్షితమైన సేవలను అందించేందుకు టెక్నాలజీలో అప్ గ్రేడ్ పనులు చేపడుతోంది. దీంతో తరచూ ఆన్‌లైన్ సేవలకు విఘాతం కలుగుతోంది.
We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/3Y1ph0EUUS
— State Bank of India (@TheOfficialSBI) January 21, 2022
Also Read: