Lockdown News: హడలెత్తిస్తున్న కోవిడ్ థర్డ్ వేవ్.. ఆ రాష్ట్రంలో ఒక్క రోజు సంపూర్ణ లాక్ డౌన్
గత వారం రోజులకు పైగా ఆ రాష్ట్రంలో 20వేలకు పైగా రోజువారీ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో ఆదివారం (జనవరి 23) రాష్ట్ర వ్యాప్త సంపూర్ణ లాక్‌డౌన్ అమలుచేయనున్నారు.
Tamil Nadu Lockdown News: తమిళనాడును కోవిడ్ మహమ్మారి(Covid-19) హడలెత్తిస్తోంది. థర్డ్ వేవ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఆదివారం (జనవరి 23)నాడు రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలీన్(MK Stalin) ప్రకటించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం శనివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతుంది. అన్ని ప్రైవేటు ఆఫీసులు 50శాతం సిబ్బందితో పనిచేయాలని సూచించారు. సాధ్యమైనంత మేరకు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) చేసేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో గురువారంనాడు 28,561 కొత్త కేసులు నమోదవగా, 39 మరణాలు సంభవించాయి. దీంతో ఆ రాష్ట్రంలో యాక్టిక్ కేసుల సంఖ్య 1,79,205గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 30,42,796కు పెరగగా, మరణాల సంఖ్య 37,112 కు చేరుకుంది. ఇక వారం రోజులుగా ఆ రాష్ట్రంలో 23,000కు పైగా రోజువారీ కొత్త ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి. ఈ దక్షిణాది రాష్ట్రంలో బుధవారం కూడా దాదాపు 27000 కేసులు నమోదయ్యాయి.
తమిళనాడులో మంగళవారం (జనవరి 18) 23,888 కొత్త కేసులు నమోదయ్యాయి, సోమవారం (జనవరి 17) 23,443 నమోదయ్యాయి. ఆదివారం (జనవరి 16) 23,975, శనివారం (జనవరి 15) 23,989, జనవరి 14 (శుక్రవారం) 23,459 నమోదయ్యాయి. దీంతో వచ్చే ఆదివారం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఈ మేరకు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
Tamil Nadu Chief Minister MK Stalin announces that there will be a complete lockdown all over the State on January 23rd (Sunday).#COVID19 pic.twitter.com/1P27rj1DGi
— ANI (@ANI) January 21, 2022
Also Read: