Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Svanidhi: మీ ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ లింకై ఉందా..? రూ.10వేల బెనిఫిట్‌ పొందవచ్చు.. ఎలాగంటే..!

PM Svanidhi: కరోనా కాలంలో ఎంతో మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన కుటుంబాలు కూడా..

PM Svanidhi: మీ ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ లింకై ఉందా..? రూ.10వేల బెనిఫిట్‌ పొందవచ్చు.. ఎలాగంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 21, 2022 | 6:28 PM

PM Svanidhi: కరోనా కాలంలో ఎంతో మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంది. ఇప్పుడు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron)తో మరింత భయాందోళన నెలకొంది. కరోనా (Corona)తో ఇబ్బందులు పడుతోన్న వీధి వర్తకులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వారి కోసం కేంద్ర సర్కార్‌ పలు స్కీమ్‌లను ప్రారంభించింది. వాటిలో పీఎం స్వనిధి స్కీమ్ (PM Svanidhi) ఒకటి. ఈ స్కీమ్‌ కింద వీధి వర్తకులకు రూ.10,000 వరకు ఆర్థిక సాయాన్ని పొందే అకాశం ఉంది. అలాగే ఈ స్కీమ్‌ కింద తీసుకున్న సాయాన్ని సకాలంలో చెల్లిస్తే రాయితీలను కూడా అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే మొబైల్‌ (Mobile) నంబర్‌ను ఆధార్‌ (Aadhaar)తో లింక్‌ చేయడం తప్పనిసరి.

ఈ పథకం కింద సాయాన్ని పొందేవారు మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌కు లింక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 24, 2020 కంటే ముందు లేదా ఆ తేదీ నాటికి మొబైల్ నెంబర్‌తో ఆధార్ (Aadhaar Mobile Number link) లింకైన వారికి ఈ రుణం అందుబాటులో ఉంటుంది. కేంద్ర సర్కార్‌ ఈ స్కీమ్‌ను 2020 జూన్‌ 1వ తేదీన ప్రారంభించింది. ఈ స్కీమ్‌ కాల వ్యవధి 2022 మార్చి వరకు ఉంది.

అర్బన్‌, సెమీ అర్బన్‌ లేదా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వీధి వర్తకులందరికీ ఈ రుణ సదుపాయం అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ రుణంపై కట్టే వడ్డీపై కూడా రాయితీ పొందవచ్చు. వడ్డీ రేటులో సుమారు 7 శాతం వరకు సబ్సిడీ వస్తుంది. కేంద్ర సర్కార్ వడ్డీ రేటులో 7 శాతం వరకు సడ్సిడీ వస్తుంది. ఈ పీఎం స్వనిధి స్కీమ్‌ (PM Svanidhi Scheme) కింద తీసుకున్న రుణాన్ని ఏడాది పాటు ఈఎంఐ (EMI) రూపంలో చెల్లించుకోవచ్చు. ఈ రుణం పొందాలంటే ముందస్తుగా ఎలాంటి చెల్లింపులు ఉండవు. పీఎం స్వనిధి పథకం కింద అర్హులైన వీధి వ్యాపారులు వెబ్‌సైట్ pmsvanidhi.mohua.gov.in ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Gold Prices: పసిడి కొనుగోలుదారులకు షాకింగ్‌.. భారీగా పెరగనున్న బంగారం ధర..!

Budget 2022: ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే బంగారం ప్రియులకు శుభవార్తే.. అదేంటంటే..!