Double Dekkar E Buses: హైదరాబాద్​కు డబుల్ డెక్కర్ ఈ బస్సులు.. ఎప్పుడు రోడ్లపైకి వస్తాయంటే..

హైదరాబాద్​కు త్వరలో డబుల్ డెక్కర్ ఈ బస్సులు రానున్నాయి. ఇందుకు సంబంధించి సీఈఎస్‌ఎల్‌ ప్రకటన చేసింది...

Double Dekkar E Buses: హైదరాబాద్​కు డబుల్ డెక్కర్ ఈ బస్సులు.. ఎప్పుడు రోడ్లపైకి వస్తాయంటే..
Double Delmar Bus
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 21, 2022 | 6:34 PM

హైదరాబాద్​కు త్వరలో డబుల్ డెక్కర్ ఈ బస్సులు రానున్నాయి. ఇందుకు సంబంధించి సీఈఎస్‌ఎల్‌ ప్రకటన చేసింది. డిజీల్ ధర పెరుగుదల, కాలుష్యం కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలిని ప్రభుత్వం సూచిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వరంగ కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) 5,580 ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలుకు సంబంధించి 5,500 కోట్ల విలువైన భారీ టెండర్‌ను ప్రకటించింది. ఇందులో 130 డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఉన్నాయి. తొలి దశలో హైదరాబాద్, బెంగళూరు, సూరత్, కోల్‌కతా పట్టణాలకు ఈ ఏడాది జూలై నాటికే ఈ–బస్సులు అందుబాటులోకి వస్తాయని సీఈఎస్‌ఎల్‌ పేర్కొంది. ప్రపంచంలో ఇదే అతిపెద్ద పథకమని సీఈఎస్‌ఎల్‌ ఎండీ, సీఈవో మహువా ఆచార్య చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల ఈ–బస్సుల లక్ష్యాల సాధనకు తమ వంతు సహకారం అందించాలన్నారు. కర్బన ఉద్గారాల్లో భారత్‌ను తటస్థంగా సున్నా స్థాయికి చేర్చే లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని సీఈఎస్‌ఎల్‌ తెలిపింది. హైదరాబాద్​లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడిపించాలంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను ఓ నెటిజన్‌ ట్విట్టర్​లో కోరగా.. వెంటనే ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ని దృష్టికి కేటీఆర్‌ తీసుకెళ్లారు. ఈ మేరకు డబుల్‌ డెక్కర్‌ బస్సులు కొనేందుకు ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఇదీ సాధ్యం కాలేదు. సీఈఎస్‌ఎల్‌ సంస్థ దాదాపు 130 డబుల్‌ డెక్కర్‌ బస్సులు కొనుగోలు చేయడంతో హైదరాబాద్​లో డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి.

Read Also.. Fixed Deposite: ఫిక్స్​డ్ డిపాజిట్ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..