Woman Pulls Bus With Hair video: డబుల్ డెకర్ బస్సును జడతో సులభంగా లాగి గిన్నిస్ బుక్‌లో రికార్డ్.. ఆశ్చర్యపరుస్తున్న వీడియో..
Guinness World Record: జడతో బస్సును లాగడం ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ సాధ్యం కాదు. అదో పెద్ద సాహసం అనే చెప్పాలి. సాహసం కన్నా అసాధ్యం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ.. పంజాబ్‌కు చెందిన ఆశా రాణి అనే మహిళ తన జడతో డబుల్ డెకర్ బస్సును సునయాసంగా లాగింది.
Guinness World Record: జడతో బస్సును లాగడం ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ సాధ్యం కాదు. అదో పెద్ద సాహసం అనే చెప్పాలి. సాహసం కన్నా అసాధ్యం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ.. పంజాబ్‌కు చెందిన ఆశా రాణి అనే మహిళ తన జడతో డబుల్ డెకర్ బస్సును సునయాసంగా లాగింది. ఇక బస్సు బరువు అక్షరాల 12,126 కేజీలు. అన్ని వాహనాల్లోనే అత్యంత బరువు ఉన్న వాహనం. దీన్ని తన జడతో లాగి గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది ఆశా రాణి. 2016లోనే ఆశా రాణి ఇటలీలో ఈ ఫీట్‌ను సాధించింది. తనకు ఐరన్ క్వీన్ అనే బిరుదును కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఇచ్చారు. అలాగే.. గిన్నిస్ బుక్‌లో తన పేరును నమోదు చేశారు. తాజాగా అప్పటి వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇన్‌స్టా పేజీలో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే గిన్నిస్‌బుక్‌లో రికార్డు సంపాదించడం ఆషామాషీ కాదు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. పట్టుదల, ఒపిక ఇలా ఎన్నో విధాలుగా సిద్ధం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఇది వరకే ఏడు గిన్నిస్ బుక్ రికార్డులు సాధించింది. గతంలో ఆమె పళ్లతో 22.16 సెకండ్ల వ్యవధిలో ఓ కారును 25 మీటర్ల దూరం లాగింది. 2013లో తన చెవులతో1700 కిలోల బరువున్న వాహనాన్ని లాగి రికార్డు సృష్టించింది. ఇప్పుడు మరో రికార్డు సృష్టించి ఔరా అనుపించుకుంది.