Keerthy Suresh: ఎట్టకేలకు మహానటి సినిమాకు మోక్షం.. ఆరోజే థియేటర్లలో విడుదల కానున్న గుడ్ లక్ సఖి..
మహానటి' కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గుడ్ లక్ సఖి'. ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి నగేష్

‘మహానటి’ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్ లక్ సఖి’. ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్లు సినీ ప్రియుల మెప్పు పొందాయి. కాగా ఇప్పటికే షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు గుడ్ లక్ సఖి సినిమా ను ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 28న థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
కాగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో షూటర్ పాత్రలో కనిపించనుంది కీర్తి సురేశ్. మహానటి తర్వాత ఆమె నటించిన ‘పెంగ్విన్’ ‘మిస్ ఇండియా’ చిత్రాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఈ చిత్రంపై నే ఆశలు పెట్టుకుందీ అందాల తార. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఆమె సినిమా రిలీజ్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగాఅభిమానులతో పంచుకుంది. ‘థియేటర్లలో సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ‘ అంటూ ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను పంచుకుంది.
View this post on Instagram
Also Read: IND VS SA: రెండో వన్డేలోనూ చతికిల పడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..