PM Kisan Nidhi Yojana: బడ్జెట్‌లో రైతులకు గుడ్‌న్యూస్ రానుందా..!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2022న మోదీ ప్రభుత్వం రెండోసారి నాలుగో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

మోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు పెద్ద బహుమతిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

పీఎం కిసాన్ నిధి యోజన కింద ఇచ్చే వార్షిక మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ.8,000కి పెంచే ఛాన్స్ ఉంది.

ఎరువులు, విత్తనాలు, డీజిల్ ధరలు భారీగా పెరిగాయని, దీంతో ఈ సహాయాన్ని పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

దీంతో పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న చిన్న, మధ్యస్థ రైతులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది.

పీఎం కిసాన్ యోజన డిసెంబర్ 2018లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 1.8 లక్షల కోట్లను 10 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు.