AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్లాప్ సినిమా రీరిలీజ్ చేస్తే హిట్టే.. థియేటర్లలో ప్రేమకథ చిత్రమ్ సన్సేషన్..

రీరిలీజ్ ట్రెండ్ సౌత్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుందో చెప్పక్కర్లేదు. మొదట్లో ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి విడుదల చేయడంతో భారీగా కలెక్షన్స్ రాబట్టాయి. అప్పట్లో ప్లాప్ అయిన సినిమాలు సైతం రీరిలీజ్ చేయడంతో భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఓ ప్లాప్ లవ్ స్టోరీ థియేటర్లలో సత్తా చాటుతుంది.

Tollywood: ప్లాప్ సినిమా రీరిలీజ్ చేస్తే హిట్టే.. థియేటర్లలో ప్రేమకథ చిత్రమ్ సన్సేషన్..
Sanam Teri Kasam
Rajitha Chanti
|

Updated on: Feb 10, 2025 | 7:00 AM

Share

సౌత్ ఇండస్ట్రీలో కొన్ని రోజుల క్రితం రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగింది. ఒకప్పుడు హిట్ అయిన సినిమాలు.. ప్లాప్ అయిన లవ్ స్టోరీస్ మరోసారి అడియన్స్ ముందుకు తీసుకురాగా.. భారీ విజయాన్ని అందుకున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఈ రీరిలీజ్ ట్రెండ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అదే ట్రెండ్ కొనసాగుతుంది. తాజాగా ఒకప్పుడు ప్లాప్ అయిన సినిమాను మరోసారి విడుదల చేయగా.. థియేటర్లలో సెన్సేషన్ అవుతుంది. తెలుగు నటుడు హర్షవర్దన్ రాణే, మావ్రా హుకానే హీరోహీరోయిన్లుగా నటించిన హిందీ సినిమా ‘సనమ్ తేరి కసమ్’. 2016 ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ రాగా.. కమర్షియల్ హిట్ కావడంలో ఫెయిల్ అయ్యింది. ఇక ఇదే సినిమాను దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత థియేటర్లలో రీరిలీజ్ చేశారు మేకర్స్.

ఫిబ్రవరి 7న ఈ సినిమాను మరోసారి థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. అలాగే భారీ వసూళ్లు రాబడుతుంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే రూ.9.5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హాలీవుడ్ పాపులర్ మూవీ ఇంటర్ స్టెల్లాడ్ సైతం ఒకేరోజు రీరిలీజ్ కాగా.. సనమ్ తేరి కసమ్ మాత్రం దూసుకుపోతుంది. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.9 కోట్లు రాబట్టింది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ.9.5 కోట్లు కలెక్షన్స్ దాటేసింది.

సనమ్ తేరి కసమ్ రీరిలీజ్ అయిన మొదటి రోజే రూ.4.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో రోజు రూ.5.25 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు ఇ్పపుడు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఈ ఆదివారం సైతం భారీగానే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాధికా రావు, వినయ్ సప్రు దర్శకత్వం వహించారు. హిమేశ్ రేష్మియా మ్యూజిక్ అందించగా.. జోమ్ జోమ్ ప్రొడక్షన్స్, సోహమ్ రాక్‍స్టార్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మించారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!