AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natasha Stankovic: హార్దిక్ మాజీ భార్య మళ్లీ ప్రేమలో పడిందా? మిస్టరీ మ్యాన్‌తో నటాషా.. వీడియో వైరల్

బాలీవుడ్ ప్రముఖ నటి నటాషా స్టాంకోవిచ్, భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుని విడిపోయారు. సుమారు నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన ఈ జంట విడిపోతున్నట్లు గతేడాది అధికారికంగా ప్రకటించారు. విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ వ్యక్తిగత పనుల్లో బిజీగా మారిపోయారు.

Natasha Stankovic: హార్దిక్ మాజీ భార్య మళ్లీ ప్రేమలో పడిందా? మిస్టరీ మ్యాన్‌తో నటాషా.. వీడియో వైరల్
Natasha Stankovic
Basha Shek
|

Updated on: Feb 10, 2025 | 4:30 PM

Share

విడాకుల తర్వాత టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. క్రికెట్ మ్యాచులతో పాండ్యా బిజీగా గడుపుతుంటే, నటాషా మళ్లీ కెమెరా ముందు నటించేందుకు రెడీ అవుతోంది. ఇదే సమయంలో తమ డేటింగ్, రిలేషన్ షిప్ విషయాలతో హార్దిక్, నటాషా. తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా డేటింగ్ లో ఉన్నాడని పుకార్లు వచ్చాయి. అలాగే నటాషా కూడా మళ్లీ ప్రేమలో పడిందని ప్రచారం జరిగింది. . ఇంతలో నటాషా ఒక మిస్టరీ మ్యాన్ తో ఉన్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నటాషా స్వయంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నటాషాతో కలిసి కనిపించిన వ్యక్తి మరెవరో కాదు. ఆమె సన్నిహితుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిచ్. ఇప్పుడు నటాషా, అలెగ్జాండర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వారిద్దరూ కలిసి వ్యాయామం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, నటాషా ‘ఫ్రై డే ఫన్ డే’ అనే క్యాప్షన్‌ జత చేసింది.

నటాషా, అలెగ్జాండర్ ఈ మధ్యన తరచుగా కలిసి కనిపిస్తున్నారు. పార్టీల నుంచి వర్కౌట్ల వరకు వారి ఫోటోలు, వీడియోలు ప్రతిచోటా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు నటాషా, అలెగ్జాండర్ వర్కౌట్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ, కామెంట్లు చేస్తున్నారు. నటాషా, అలెగ్జాండర్‌లను ఒకరితో ఒకరిని లింక్ చేస్తున్నారు. అదే సమయంలో వారిద్దరి ఫిట్‌నెస్ దినచర్యను చాలా మంది ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అలెగ్జాండర్ తో నటాషా స్టాంకోవిచ్..

View this post on Instagram

A post shared by @natasastankovic__

అలెగ్జాండర్ ఎవరంటే?

అలెగ్జాండర్ గురించి చెప్పాలంటే, అతను ఒక ఫిట్‌నెస్ కోచ్. అలాగే నటుడు, మోడల్ కూడా. అలెగ్జాండర్ కూడా నటి దిశా పటానితో చాలాసార్లు కనిపించాడు. వారిద్దరి ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

నటాషా, హార్దిక్ లు 2020 లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2022లో మరోసారి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. అయితే వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. గతేడాది విడాకులు తీసుకుని విడిపోయారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా
మనుషులేనా.. గాయాన్ని దాచిపెట్టి సిరాజ్‌ను ఆడిస్తారా..!
మనుషులేనా.. గాయాన్ని దాచిపెట్టి సిరాజ్‌ను ఆడిస్తారా..!
ఉసేన్ బోల్ట్ రికార్డులను సవాలు చేస్తున్న సూపర్‌మ్యాన్ రోబోట్!
ఉసేన్ బోల్ట్ రికార్డులను సవాలు చేస్తున్న సూపర్‌మ్యాన్ రోబోట్!
ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే..
ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే..
కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యంకాలే.. అరుదైన రికార్డులో గిల్
కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యంకాలే.. అరుదైన రికార్డులో గిల్
పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?
పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?
అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు
అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు
150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?
150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?
50 ఏళ్ల వయసులో ఓవర్ నైట్ స్టార్..
50 ఏళ్ల వయసులో ఓవర్ నైట్ స్టార్..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర