Aarushi Nishank: ఎంతకు తెగించారు! మాజీ సీఎం కూతురిని మోసగించిన నిర్మాతలు.. హీరోయిన్ ఛాన్స్ పేరుతో..
సినిమా అవకాశాల పేరుతో చాలామంది మోసపోతూ ఉంటారు. పలు నిర్మాణ సంస్థలు, డైరెక్టర్ల పేర్లు చెప్పుకొని కొందరు అమాయకులను ట్రాప్ చేసి తమ బుట్టలో వేసుకుంటారు ముఖ్యంగా ఇలాంటి వ్యవహారాల్లో అమ్మాయిలే ఎక్కువగా బాధితులుగా ఉంటారు. తాజాగా మరో అమ్మాయి కేటుగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది.

ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను ఇద్దరు నిర్మాతలు తమ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తానని చెప్పి దారుణంగా మోసం చేశారు. ఆమె నుంచి ఏకంగా రూ. 4 కోట్ల రూపాయలు తీసుకుని ఉడాయించారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ కుమార్తె, నటి ఆరుషి నిశాంక్ తనను ఇద్దరు నిర్మాతలు మోసం చేశారని వాపోయింది. ముంబైకు చెందిన నిర్మాతలు మానసి వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లా తన దగ్గర నుంచి రూ. 4 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సదరు నటి డెహ్రాడూన్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిర్మాతలపై రూ.4 కోట్ల ఛీటింగ్ తో పాటు మానసిక హింస, బెదిరింపులకు పాల్పడటం వంటి అభియోగాలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఎలా మోసం చేశారంటే..
సినీ నిర్మాణం తో యాక్టింగ్ రంగలో అనుభవమున్న ఆరుషి నిశాంక్ ప్రకారం , ఇద్దరు నిర్మాతలు ఆమెను మోసం చేశారని ఆరోపించారు. ఆరుషి ఇంటికి ఇద్దరు నిర్మాతలు వచ్చారు. తాను ఎకా ఫిల్మ్స్ ప్రొడక్షన్ లిమిటెడ్ డైరెక్టర్ అని చెప్పుకుంటూ, ‘ఆంఖో కి గుస్తాఖియాన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో షానయ కపూర్, నటుడు విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రానికి మరో ప్రధాన నటి అవసరమని సదరు నిర్మాతలు ఆరుషి దగ్గరకు వచ్చారట. ఈ సినిమాలో తాను రూ.5 కోట్లు పెట్టుబడి పెడితే, ఆ పాత్ర తనకు దక్కడమే కాకుండా, సినిమా మొత్తం లాభాలలో 20% కూడా వస్తుందని నిర్మాతలు తనకు చెప్పారట. అంతేకాదు ఆరుషికి పాత్ర నచ్చకపోతే లేదా సంతృప్తి చెందకపోతే, ఆమె చెల్లించిన మొత్తం మొత్తాన్ని 15% వడ్డీతో తిరిగి ఇస్తామని ఇద్దర నిర్మాతలు హామీ ఇచ్చారట. అయితే ఆమెకు స్క్రిప్ట్ కూడా చెప్పలేదు. ఇక ఆరుషి తన డబ్బు తిరిగి అడిగినప్పుడు, ఈ సినిమా షూటింగ్ భారతదేశంలో పూర్తయిందని, ఇప్పుడు షూటింగ్ యూరప్‌లో జరుగుతుందని ఆమెకు చెప్పారట.
View this post on Instagram
కేసు నమోదు..
ఆరుషి ఇద్దరు నిర్మాతలపై మోసం, మానసిక వేధింపులు, బెదిరింపులు, నేరపూరిత కుట్ర మరియు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని తాను మోసం చేసిన రూ.4 కోట్లను తిరిగి తనకు అందేలా చూడాలని ఆరుషి కోరుతోంది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి