Rashmika Mandanna: బాక్సాఫీస్ క్వీన్ ఈజ్ బ్యాక్.. గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక మందన్నా.. వీడియో వైరల్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఇందులో బాలీవుడ్ సినిమా ఛావా త్వరలో రిలీజ్ కానుంది. ఈ హిస్టారికల్ మూవీ లో విక్కీ కౌశల్ హీరో గా నటిస్తున్నాడు.

ప్రముఖ నటి రష్మిక మందన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె చేతిలో పలు కీలక ప్రాజెక్టులు న్నాయి. దీంతో నిత్యం షూటింగులు, ప్రయాణాలు అంటూ బిజి బిజీగా గడిపింది. అయితే ఇటీవల ఆమె కాలికి గాయమైంది. జిమ్ లో వ్యాయామం చేస్తుండగా కాలు బెణికింది. దీంతో నడవడానికి కూడా ఇబ్బంది పడిందీ అందాల తార. అయితే ఇప్పుడు రష్మిక మందన్న తన కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ విమానాశ్రయంలో ఆమె నడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇందులో రష్మిక ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తూ కనిపించడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. రష్మిక మందన్న నటించిన ఛావా సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నప్పుడు తన కాలికి గాయం కావడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. అయినప్పటికీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వీల్‌చైర్‌లో వచ్చింది. అప్పట్లో ఆమె పరిస్థితి చూసి అభిమానులు బాధపడ్డారు. అదే సమయంలో సినిమా పట్ల తనకున్న అంకిత భావం, నిబద్ధత ను అందరూ ప్రశంసించారు. అయితే ఇప్పుడు రష్మిక కోలుకుంది.
రష్మిక మందన్న కాలికి గాయం కావడంతో చాలా రోజుల పాటు వీల్ చైర్ కే పరిమితమైంది. కానీ ఇప్పుడు ఆమె హైదరాబాద్ విమానాశ్రయంలో ఎలాంటి సహాయం లేకుండా నడుచుకుంటూవెళ్లిపోయింది . ‘ఛవా’ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఆ సినిమా ప్రమోషన్లలో రష్మిక మందన్న పాల్గొంటుంది. ఈ క్రమంలోనే ఆమె హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లింది. ‘ఛావా’ సినిమాలో విక్కీ కౌశల్ సరసన రష్మిక మందన్న నటించింది. చారిత్రక కథాంశంతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నజోడికి సినిమాపై అంచనాలను పెంచేసింది. దీంతో ఈ సినిమా చూడటానికి అందరూ ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప 2’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రష్మిక నటిస్తోన్న సినిమా కావడంతో చావా అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ చాలా కష్టపడ్డాడు.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రష్మిక మందన్నా..
Finally 🥺🤌 Our queen is back 🥺@iamRashmika#RashmikaMandannapic.twitter.com/bxA8LqqeOt
— Virosh trends (@rowdyrashmika) February 9, 2025
ఛావా ప్రమోషన్లలో నేషనల్ క్రష్..
Rashmika Mandanna steals the spotlight at Chitra Cinema, Dadar, promoting her upcoming movie Chhaava! 🌟🎬 #Chhaava #RashmikaMandanna #MoviePromotion #buzzzookascrolls #celebrity pic.twitter.com/Uijil6DaYx
— Buzzzooka Scrolls (@Buzzz_scrolls) February 9, 2025
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.