66 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి రెడీ అయిపోయిన స్టార్ సింగర్.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే?
సినిమా సెలబ్రిటీల ప్రపంచంలో వివాహం, విడాకులు చాలా సాధారణమై పోయాయి. సెలబ్రిటీలు విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకోవాలను కోవడం ఈ మధ్యన పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే ప్రముఖ గాయకుడు 66 ఏళ్ల వయసులో నాలుగోసారి వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు.

ప్రముఖ గాయకుడు లక్కీ అలీ 66 ఏళ్ల వయసులో నాల్గవసారి వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగిన 18వ కథాకరన్ అంతర్జాతీయ కథకుల ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్కీ అలీ తన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా, తన కొన్ని హిట్ పాటల వెనుక ఆసక్తికరమైన కథలను కూడా పంచుకున్నాడు. ఇంతలో లక్కీ అలీని అతని తదుపరి కల గురించి అడిగినప్పుడు ఆయన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా ‘మళ్ళీ పెళ్లి చేసుకోవాలనేది నా కల’ అంటూ నాలుగోసారి వివాహం చేసుకోవాలనే తన కోరికను వ్యక్తం చేశారు లక్కీ ఆలీ. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లక్కీ అలీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే ఆయన ఇప్పటికే మూడుసార్లు వివాహం చేసుకున్నారు. కానీ అతని ముగ్గురు భార్యలతో ఆయన సంబంధాలు ఎక్కువ కాలం కొనసాగలేదు.
లక్కీ అలీ మొదటి వివాహం ఆస్ట్రేలియా నివాసితో జరిగింది. వారిద్దరూ మొదటిసారి ‘సునో’ ఆల్బమ్ సమయంలో కలుసుకున్నారు. వారి మొదటి పరిచయం ప్రేమగా మారిన తర్వాత, వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. చివరికి వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మొదటి భార్యతో విడాకుల తర్వాత లక్కీ అలీ 2000లో అనాహిత అనే పార్సీ మహిళను వివాహం చేసుకున్నారు. లక్కీ అలీని వివాహం చేసుకోవడానికి అనహిత ఇస్లాం మతంలోకి మారి తన పేరును ఇనాయాగా మార్చుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
రెండవసారి విడాకులు తీసుకున్న తర్వాత, లక్కీ అలీ 2010లో కేట్ ఎలిజబెత్ హల్లమ్‌ను వివాహం చేసుకున్నాడు. లక్కీ అలీని వివాహం చేసుకున్న తర్వాత, ఆమె తన పేరును ఐషా అలీగా మార్చుకుంది. లక్కీ అలీ మూడవ భార్య అతని కంటే 24 సంవత్సరాలు చిన్నది. అయితే వారు 2017 లో విడాకులు తీసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.