AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: పంజాబీ సింగర్ హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌కు భద్రత పెంపు..

పంజాబ్ సింగర్ సిద్ధూ ముసేవాలా(singer Sidhu Moosewala) ఇటీవల దుండగుల చేతిలో అతి కిరాతకంగా హత్య చేయబడిన విషయం తెలిసిందే.

Salman Khan: పంజాబీ సింగర్ హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌కు భద్రత పెంపు..
Salman Khan
Rajeev Rayala
| Edited By: |

Updated on: May 31, 2022 | 7:40 PM

Share

పంజాబ్ సింగర్ సిద్ధూ ముసేవాలా(singer Sidhu Moosewala) ఇటీవల దుండగుల చేతిలో అతి కిరాతకంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నెల 29న ( ఆదివారం) దుండగులు సిద్దు పై కాల్పులకు తెగబడ్డారు. మాన్సాలోని జవహర్కే గ్రామ సమీపంలో మూసేవాలాపై కాల్పులు జరిగాయి. ఈ సంఘటన తర్వాత ముసేవాలా ప్రాణాపాయ స్థితిలో మాన్సాలోని ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. అంతకు ముందు గ్యాంగ్‌స్టర్ల నుంచి మూసేవాలకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సిద్దు హత్యతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు భద్రతను పెంచారు పోలీసులు. ముంబై పోలీసులు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన నిందితుడిగా తేలింది. ఈ నేపథ్యంలో సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, “మేము సల్మాన్ ఖాన్ కు భద్రతను పెంచాము. రాజస్థాన్‌కు చెందిన ముఠా నుంచి సల్మాన్ కు ప్రాణాపాయం ఉందని తెలుస్తుంది అని అన్నారు.  బ్లాక్‌బక్స్‌ బిష్ణోయ్ కమ్యూనిటీ జంతువులను పవిత్ర జీవులుగా ఆరాధిస్తుంటారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉన్నందున బిష్ణోయ్ సల్మాన్ ను హత్య చేస్తానని బెదిరించాడు.

లారెన్స్ బిష్ణోయ్ 2018లో కోర్టు బయట  “మేము జోధ్‌పూర్‌లో సల్మాన్ ఖాన్‌ను చంపుతాము అని బహిరంగంగా బెదిరించాడు. ” బిష్ణోయ్  సల్మాన్ ఖాన్ హత్యకు సంబంధించి రెక్కీ నిర్వహించేందుకు ముంబైకి వెళ్లాడని  పోలీసులు కనుగొన్నారు. 2020 ఒక హత్య కేసులో బిష్ణోయ్ సహచరుడు రాహుల్ అలియాస్ సన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడిని విచారిస్తున్న సమయంలో మేము సల్మాన్ ను చంపబోతున్నాం అని పోలీసులకు తెలిపాడు. అలాగే బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ హత్యకు సంబంధించి రెక్కీ నిర్వహించేందుకు ముంబైకి వెళ్లాడని పోలీసులు చెప్పాడు సన్నీ. ఇక ఇప్పుడు సింగర్ సిద్దు హత్య జరగడంతో అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ కు భద్రత పెంచారు.

ఇవి కూడా చదవండి

Ileana: నీ సన్నజాజి సోయగాలను చూసేందుకు నయనాలు చాలవే..ఇలియానా న్యూ లుక్స్ వైరల్..

Vidya Balan: ఉష్..! వయస్సుతో పని ఎం ఉంది..? అందమే మాట్లాడుతుంది.. విద్య బాలన్

Super Star Krishna Birthday: ఐ లవ్ యూ నాన్న.. తండ్రికి విషెష్ చెబుతూ మహేష్ ఎమోషనల్ పోస్ట్..

Follow Us