Telugu Movies: ఈ వారం థియేటర్లలో.. ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. మేజర్ నుంచి విక్రమ్ వరకు..

ఇక ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. జూన్ మొదటి వారంలో విడుదలయ్యే సినిమాలెంటో తెలుసుకుందామా.

Telugu Movies: ఈ వారం థియేటర్లలో.. ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. మేజర్ నుంచి విక్రమ్ వరకు..
Major
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 31, 2022 | 7:44 PM

ఎఫ్ 3 సినిమాతో ఇప్పుడు థియేటర్ల వద్ద ఫ్యామిలీ ఆడియన్స్ సందడి చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా కరోనా సంక్షోభంతో థియేటర్లకు సినీ ప్రియుల రాక తగ్గిపోగా…. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి పాన్ ఇండియా సినిమాలతో థియేటర్లకు పూర్వ వైభవం వచ్చింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వేసవి సినిమాల సందడి కొనసాగుతుంది. ఇక ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. జూన్ మొదటి వారంలో విడుదలయ్యే సినిమాలెంటో తెలుసుకుందామా.

మేజర్.. 26/11 ముంబై దాడులలో వీరమరణం పొందిన జవాన్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా మేజర్.. డైరెక్టర్ శశి కిరణ్ తిక్క రూపొందించిన ఈ సినిమాలో యంగ్ హీరో అడివి శేష్ మేజర్ సందీప్ పాత్రలో నటించగా.. సాయి మంజ్రేకర్, శోభిత దూళిపాళ్ల కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలు నగరాల్లో ఈ సినిమాను ప్రీవ్యూ షోస్ వేస్తున్న సంగతి తెలిసిందే.

విక్రమ్.. విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం విక్రమ్. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించగా.. తమిళ్ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా జూన్ 3న తెలుగు, తమిళ్ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

సామ్రాట్ పృథ్వీరాజ్.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్. రాజ్ పుత్ యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. పలు దక్షిణాది భాషలలో విడుదల చేస్తున్నారు.

ఓటీటీలో రాబోయే సినిమాలు.. 9 అవర్స్.. నందమూరి హీరో తారకరత్న చాలాకాలం తర్వాత నటిస్తోన్న వెబ్ సిరీస్ 9 అవర్స్. ఇందులో అజయ్, మధుశాలిని కీలకపాత్రలలో నటిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ అందించిన కథతో నిరంజన్ కౌశిక్, జాకబ్ వర్గీస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్.. ద బాయ్స్.. వెబ్ సిరీస్.. జూన్ 3

నెట్ ఫ్లిక్స్.. జనగణమన.. మలయాళం.. జూన్ 2 సర్వైవింగ్ సమ్మర్.. వెబ్ సిరీస్.. జూన్ 3 ద పర్ ఫెక్ట్ మదర్.. వెబ్ సిరీస్.. జూన్ 3