Actor Ali: అలా ప్రచారం చేయడం సరైనది కాదు.. వేదికపైనే మనవి చేసిన ఆలీ..
డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 సినిమా సక్సెస్ మీట్లో పాల్గోన్న ఆలీ ఈ వ్యాఖ్యలు చేశారు.
హిట్ అయిన సినిమాను బాగోలేదని ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం సరైందికాదన్నారు కమెడియన్ ఆలీ (Ali).. సినిమాను నమ్ముకున్నవారే ఇలా ప్రచారం చేయడం బాగలేదన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 సినిమా సక్సెస్ మీట్లో పాల్గోన్న ఆలీ ఈ వ్యాఖ్యలు చేశారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమా మే 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహన్ కీలకపాత్రలో నటించింది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ వేడుకను హైదరాబాద్ దస్‌పల్లా హోటల్ లో సోమవారం నాడు చిత్ర యూనిట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ.. ” అద్భుతమైన హిట్ ఇచ్చిన ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈరోజు నిజమైన పండగు రోజు. సోమవారం కూడా హౌస్‌ఫుల్ అవ్వడానికి కారణం ఈ బేనర్ కున్న విలువ, దర్శకుడు అనిల్‌రావిపూడి, హీరోలైన వెంకటేష్, వరుణ్‌తేజ్ పై వున్న నమ్మకం. సినిమా బాగుంటే ఎంత పెద్ద హిట్ ఇస్తారనేందుకు ఎఫ్3 నిదర్శనం. చాలామంది ఫోన్లు చేసి రెండు, మూడు సార్లు చూశామంటున్నారు. సినిమా హిట్ అయితే అందరూ బాగుంటారు. కొంతమంది హిట్ అయిన సినిమాను బాగోలేదని ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం సరైందికాదని మనవి. ఎందుకంటే మీరుకూడా సినిమాను నమ్ముకున్నవారే కదా. గతంలో చెన్నైలో వుండగా ఇలాంటి వార్తలు వినిపించేవికాదు. ఒకరి సినిమా హిట్ అయితే మరొకరు బాధపడడం ఏమిటో అర్థంకాదు. అవతలివారు బాగుండాలి అని కోరుకుంటే దేవుడు మనల్ని బాగా చూస్తాడు. అనిల్‌గారు నా చేతికి గన్ ఇచ్చి చేయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతమైన పండుగ. అందులో నేనూ వుండడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.