Samudrala Ramanujacharya: సాహితీ సముద్రుడు సముద్రాల రామానుజాచార్య.. ఆయన గురించి పలు విశేషాలు..

రామానుజాచార్యలు పాటలు రాసినా, మాటలు రాసినా కొంత మంది నిర్మాతలు చోటు కలుసొస్తుందనో ఏమో టైటిల్స్‌లో సముద్రాల అని బ్రాకెట్లో జూ అని పెట్టేవారు..

Samudrala Ramanujacharya: సాహితీ సముద్రుడు సముద్రాల రామానుజాచార్య.. ఆయన గురించి పలు విశేషాలు..
Ramanujacharya
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 31, 2022 | 7:44 PM

మహాసముద్రం కడుపున మరో సముద్రం పుట్టింది. అది అప్పుడప్పుడు గంభీర ముద్రను దాల్చింది. ఒక్కోసారి తుంటరి పనులు చేసింది. అలలు అలలుగా వచ్చి తెలుగు సిసినిమాకు అచ్చమైన ఆణి ముత్యాలను అందించింది. ఆ సముద్రం ఎవరనుకుంటున్నారు? సముద్రాల రాఘవాచార్య కుమారుడు సముద్రాల రామానుజాచార్య.

రామానుజాచార్యలు పాటలు రాసినా, మాటలు రాసినా కొంత మంది నిర్మాతలు చోటు కలుసొస్తుందనో ఏమో టైటిల్స్‌లో సముద్రాల అని బ్రాకెట్లో జూ అని పెట్టేవారు. అది రామానుజాచార్యులకు చాలా కోపం తెప్పించేది. వేస్తే జూనియర్‌ అని వేయండి. లేకపోతే మానేయండి. అంతే కానీ జూ అని మాత్రం వేయకండి. చదివేవాళ్లు నేనే జూలో వుంటాననో, అక్కన్నుంచి వచ్చాననో అనుకుంటారని గాఠ్ఠిగా వాదించేవారు.

వందలకొద్ది మంచి పాటలు రాసాకా కూడా ఇంకా జూనియర్‌ ఏమిటీ? అదీ కాకుండా జూ అని పెట్టడమేమిటీ? రామానుజాచార్యులకు కోపం వచ్చిందంటే రాదా మరి! అప్పటికి వినే నిర్మాతలు వినేవారు. కొంత మంది మాత్రం లైట్‌గా తీసుకునేవారు. చెబితే వీరు వినర్‌ బ్రదర్‌. వీళ్లని అక్కడికే పంపించాలి. అప్పుడుకాని సెట్‌రైట్‌ అవ్వరనేవారు సముద్రాల. ఇక తండ్రి కొడుకులిద్దరూ ఏదైనా సినిమాకి రాస్తే మాత్రం సీ.సముద్రాల, జూ. సముద్రాల అని పేర్లేసేవారు. అయ్యా సీ అన్నా సముద్రాల అన్నా ఒక్కటేనని రామానుజాచార్యులు వాదించినా ఫలితం వుండేది కాదు.

1923, ఏప్రిల్‌ 15న కృష్ణా జిల్లా పెద్దపులిపర్రులో సినీ కవి సముద్రాల రాఘవాచార్య, రత్నమ్మ దంపతులకు జన్మించారు రామానుజాచార్య. వీరిది పండిత వంశం. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా పెదపులివర్రు గ్రామం.. సముద్రాల కడుపున పుట్టిన మరో సముద్రమే కాబట్టి ఫస్ట్‌ ఫారంలోనే పద్యాలు గిద్యాలు రాసి పారేశారు. మద్రాస్‌లోని ప్రజామిత్ర పత్రికలో రాఘవాచార్యకు సబ్‌ ఎడిటర్‌ ఉద్యోగం రావడంతో అందరూ అక్కడికి షిఫ్టయ్యారు. మద్రాస్‌లో ఉన్న జార్జ్‌టౌన్‌ హైస్కూల్‌లో రామానుజాచార్య చదువు సాగింది. హైస్కూల్‌ స్టూడెంట్‌గా వున్నప్పుడే సముద్రుడు పేరుతో బోల్డంత సాహిత్యాన్ని వండాడు. అవన్నీ భారతి, ప్రజాబంధు పత్రికల్లో అచ్చయ్యాయి. సైన్స్‌లో పట్టా పుచ్చుకున్నాడే కానీ…సాహిత్యమంటేనే వల్లమాలిన అభిమానం. ఈయన సాహిత్యాభిలాషను గమనించిన కొంత మంది సినీ రచన చేయమనేవారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే మాయాలోకం అనే సినిమాలో సముద్రుడు పేరుతో ఓ పాట రాశాడు. ఈ సినిమా 1944లో వచ్చింది. అదే ఏడాది అండాళమ్మతో పెళ్లి జరిగింది. తండ్రీ కొడుకుల పద్య సంకలనం కడలిపొంగు పుస్తకావిష్కరణ జరిగింది.

తండ్రి రాఘవాచార్య అభిమతం మేరకు 1944లో సౌండ్‌ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు జూనియర్‌. రెండేళ్ల తర్వాత రేడియో సర్వీసింగ్ మెయింటెన్స్‌లో డిప్లమో పొందాడు. 1949లో వాహినీ స్టూడియోలో శబ్ద గ్రహణ శాఖలో చేరాడు. అప్పుడక్కడ కె.విశ్వనాథ్ కూడా అసిస్టెంట్‌ సౌండ్‌ ఇంజనీర్‌గా పని చేసేవాడు. మొత్తానికి ప్రముఖ సౌండ్‌ ఇంజనీర్లు కృష్ణయ్యర్‌, శ్రీనివాస రాఘవన్ల దగ్గర అసిస్టెంట్‌గా మూడేళ్లపాటు పనిచేశాడు జూనియర్‌. అప్పటికే తండ్రికి సినీ రచనలో సహకరిస్తుండేవాడు. ఇది గమనించిన కృష్ణయ్యర్‌ సినీ రచనలోనే నువ్వు రాణిస్తావని ఎంకరేజ్‌చేశాడు. కొడుకు మనసెరిగిన తండ్రి రాఘవాచార్య ..నీ రాత ఎలా వుంటే అలా జరుగుతుంది…నీ ఇష్టం అంటూ గ్రీన్‌ ఫ్లాగ్‌ ఊపాడు. 1952లో వినోదావారి శాంతి సినిమాలో కొన్ని పాటలు రాసే అవకాశం దొరికింది. ఆ తర్వాత అమ్మలక్కలు చిత్రానికి కొన్ని పాటలు రాశాడు.

Ramanujacharya1.

1953లో వచ్చిన బ్రతుకు తెరువు సినిమా నిజంగానే జూనియర్‌కు బ్రతుకు తెరువు ఇచ్చింది. ఇందులోని అందమె ఆనందం పాట ఆయన అదృష్టాన్ని అందలం ఎక్కించింది. అసలు ఈ పాట రాయడానికి జూనియర్‌ పడిన అంతర్మధనం అంతా ఇంతా కాదు..సినిమాకు సంగీతాన్ని అందించిదేమో ఘంటసాల. వీరిద్దరు మాంచి ఫ్రెండ్స్‌. ఘంటసాల మాస్టారిచ్చిన ట్యూన్‌కు పాటరాయాలి. పల్లవిలోని అందమె ఆనందం అన్న లైనైతే వచ్చింది. దాన్ని ఓకే చేశారు. మరి తర్వాతేం రాయాలి? తర్వాతి పంక్తిలో పంచ్‌ వుండాలి. ఆలోచించి ఆలోచించి కీట్స్‌ ఎ థింగ్‌ ఆఫ్‌ బ్యూటీ ఈజ్‌ జాయ్‌ ఫరెవర్‌ స్ఫూర్తిగా తీసుకుని ఆనందమే జీవిత మకరందం అని రాశారు. ఇక చరణాలు రాయడానికి కలం అస్సలు సాగలేదు. జూనియర్‌ ఉద్విగ్నత చూసి, టెన్షన్ నుంచి అతడిని తప్పించడానికి ఘంటసాల బీచ్‌కు తీసుకెళ్లాడు ఘంటసాల. అక్కడ ఆకస్మాత్తుగా జూనియర్‌ దృష్టి అస్తమిస్తున్న సూర్యుడిపై పడింది. అంతే. అస్తమిస్తున్న భాస్కరుడిని చూస్తూ పడమట సంధ్యారాగం అన్నారు. ఆ వెంటనే బీచ్‌ దగ్గర మల్లె పూలమ్ముతున్న ఆవిడను చూసి కుడి ఎడమల కుసుమపరాగమన్నారు.. భేష్‌ అన్నాడు ఘంటసాల. అదే ఊపుతో బీచ్‌లోని ప్రేమ జంటలను చూస్తూ ఒడిలో చెలి మోహనరాగం అని పాడేసి, ఇన్ని దృశ్యాలు చూసిన జీవితం మధురానురాగం పాడకుండా వుంటుందా? అదే రాశారు సముద్రాల. బ్రహ్మాండంరా! అని కితాబిచ్చారు ఘంటసాల. మొదటి చరణమైతే అయ్యింది కానీ రెండో చరణానికి బ్రేక్‌ పడింది. ఇంటికెళ్లారు. తండ్రికి వినిపించారు. మొదటి చరణం వినిపిస్తున్నప్పుడే రెండో చరణానికి భావం స్ఫురించింది. పడి లేచే కడలి తరంగం. ఒడిలో జడిసిన సారంగం. సుడిగాలిలో ఎగిరే పతంగం అన్నారు జూనియర్‌. వెండి పాన్‌దాన్ నుంచి తమలపాకుల చిలకలు తీస్తూ పాటను తన్మయత్వంతో వింటున్న సీనియర్‌కు షేక్స్‌పియర్‌ గుర్తుకొచ్చాడు. ఆయన ఆల్‌ లైఫ్‌ ఈజ్‌ ఎ స్టేజ్‌ వాక్యం గుర్తుకొచ్చింది. వెంటనే జీవితమే ఒక నాటకరంగం అని పాటను పూర్తి చేసి కొడుక్కు సహకరించారు. ఒరే నీకు కీట్స్‌ రూట్‌ వేశాడు ఎలాగు. నేనూ షేక్స్‌పియర్‌తో క్లోజ్‌ చేశాను అన్నాడు. అక్కడే వున్న మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు కల్పించుకుని మానవ రాగద్వేషాలు ప్రపంచంలో ఎక్కడవున్నా సహజంగానే వుంటాయని సమర్థించారు. చల్లని సాగర తీరం. మది జిల్లను మలయ సమీరం. మదిలో కదిలే పరాగం జీవితమే అనురాగయోగం అని మరికొంత కొనసాగింపుగా రాస్తే, దర్శకుడు రామకృష్ణ మెచ్చుకొని దాన్ని లీలతో పాడించి సావిత్రిపై చిత్రీకరించారు.

శబ్ద గ్రహణశాఖలో పనిచేసే సముద్రాలకు శబ్దాలపై ఎంత పట్టుందో నిశ్శబ్దంగా గమనించిన ఎన్టీ రామారావు ఎన్‌ఎటి బ్యానర్‌పై తొలిసారిగా నిర్మించిన తోడుదొంగలు చిత్రానికి మాటలు-పాటలు రాసే అవకాశం ఇచ్చారు. యోగానంద్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా జాతీయ పురస్కారాల్లో ప్రత్యేక ప్రశంసాపత్రం పొందింది. అప్పట్నుంచి ఎన్టీయార్‌, రామానుజాచార్యుల స్నేహం కడదాక సాగింది. ఎన్ఎటి పతాకంపై నిర్మించిన జయసింహ, పాండురంగ మహత్యం, గులేబకావళి కథ సినిమాలు సముద్రాల రేంజ్‌ను పెంచాయి. ఎన్టీఆర్‌, సముద్రాల జూనియర్‌లు పరస్పరం బ్రదర్‌ అని పిల్చుకునేవారు. షూటింగ్ కోసం ఔట్‌డోర్‌కు వెళ్లినప్పుడు వెంట రామానుజాచార్యను తీసుకెళ్లేవారు ఎన్టీఆర్‌. ఒకే గదిలో ఉండేవారు. సాహిత్యంపై చర్చలు జరుపుకునేవారు. ప్రతి ఉగాదికి ఎన్టీఆర్‌ నవవర్ష శుభాకాంక్షలు అని రాసి తన ఆటోగ్రాఫ్‌తో ఒక కరెన్సీ నోట్ల కట్టను జూనియర్‌ సముద్రాలకు ఇచ్చేవారు. పౌరాణికమైనా, చారిత్రాత్మకమైనా, జానపదమైనా, సాంఘికమైనా సన్నివేశమేదైనా పాత్రల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని మాటలు పాటలు రాసేవాడు జూనియర్‌. జయసింహ సినిమాలోని ఈనాటి ఈ హాయి కలకాదోయి నిజమోయీ పాట పల్లవిలోని ఈ కారం ప్రాస నిజంగానే హాయిని కలిగిస్తుంది. మంచి మనసుకు మంచిరోజులు, శాంతినివాసం, ఆత్మబంధువు, ఉమ్మడి కుటుంబం, స్త్రీ జన్మ, తల్లా పెళ్లామా, శ్రీ రామాంజనేయయుద్ధం వంటి 70 సినిమాలకు రచన చేశారు రామానుజాచార్య. జయకృష్ణా ముకుందా మురారి, అమ్మా అని పిలిచినా ఆలకించవేవమ్మా (పాండురంగమహత్యం), హిమగిరి సొంగసులు మురిపించును మనసులు (పాండవవనవాసం), ఛమకు ఛమకు తారా (పెళ్లి సందడి), ధరణికి గిరి భారమా (మంచిమనసుకు మంచిరోజులు), రాగాల సరాగాలా హాసాలా విలాసాలా, కలనైనా నీ తలపే (శాంతి నివాసం), పయనించే ఓ చిలుక (కులదైవం), శ్రీకరణ కరుణాలవాల (బొబ్బిలియుద్ధం) ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఇంకా చాలా గొప్పపాటలున్నాయి.

నర్తనశాల సినిమాకు మాటలు రాసింది సీనియర్‌ సముద్రాల. అయితే ఇందులో కొన్ని సన్నివేశాలను సృష్టించింది జూనియరే! అనారోగ్యరిత్యా కొన్ని సన్నివేశాలను సీనియర్‌ సకాలంలో అందించలేకపోయాడు. అప్పుడు రామానుజాచార్యే అప్పటికప్పుడు సెట్స్‌లోనే మాటలు రాసిచ్చాడు. ఎస్వీ రంగారావుకు రాసిని సుదీర్ఘ సంభాషణలు జూనియర్‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి…ఈ మాటలు జూనియర్‌ రాశాడని తెలుసుకున్న ఎస్వీయార్‌ కూడా ముందు ఆశ్చర్యపోయాడు. ఇంకా జూనియర్‌ ఏమిటీ? సీనియర్లకు సీనియర్‌లా రాస్తేనూ అంటూ బహుదా ప్రశంసించాడా మహానుభావుడు. సముద్రాల జూనియర్‌కు కాఫీ అంటే ప్రాణం. మాయదారి కేన్సర్‌ వ్యాధి ఆయనకు కాఫీని దూరం చేసింది. ఆయన చికిత్స నిమిత్తం ఎన్టీఆర్‌ హైదరాబాద్‌ నిమ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ఖర్చుకు వెనకాడవద్దని చెప్పారు. కేన్సర్‌ వ్యాధితోనే ఆయన మే 31, 1985లో కన్నుమూశారు.

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!