Super Star Krishna: అభిమానుల మనసుల్లో ఎప్పటికీ సూపర్ స్టార్.. నెట్టింట వైరలవుతున్న కృష్ణ పై మొదటి కథనం..

కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ చిత్రాల ప్రయోగాలను చేసి సక్సెస్ అయ్యారు.. అంతేకాకుండా.. తెలుగు చిత్రపరిశ్రమలో అప్పుడప్పుడే హైటెక్నాలజీ అప్డేట్ అవుతున్న సమయంలో సాంకేతిక టెక్నాలజీని జోడిస్తూ

Super Star Krishna: అభిమానుల మనసుల్లో ఎప్పటికీ సూపర్ స్టార్.. నెట్టింట వైరలవుతున్న కృష్ణ పై మొదటి కథనం..
Krishna Birthday
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 31, 2022 | 7:43 PM

తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి హాలీవుడ్ చిత్రాల్లోని పాత్రలను పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna). కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ చిత్రాల ప్రయోగాలను చేసి సక్సెస్ అయ్యారు.. అంతేకాకుండా.. తెలుగు చిత్రపరిశ్రమలో అప్పుడప్పుడే హైటెక్నాలజీ అప్డేట్ అవుతున్న సమయంలో సాంకేతిక టెక్నాలజీని జోడిస్తూ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పటికీ టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నారు కృష్ణ. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు.. నేటితో ఆయన 79 ఏళ్లు పూర్తిచేసుకుని.. 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా.. సూపర్ స్టార్ సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన తొలి రోజులలో వెలువడ్డ ఆనాటి ఆర్టికల్‏కు సంబంధించిన పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

1963 జనవరిలో ఓ ఉదయంపూట పాండీ బజార్‏లో భారత్ కేఫ్ ముందు నిల్చున్న ఓ పడుచు కుర్రాడు.. అటుగా వెళ్తున్న యువదర్శకుడిని చూపును ఆకర్శించడం.. ఆ తర్వాత సినిమాల్లో నటించడానికి అవకాశం రావడం.. అందుకు తమిళం నేర్చుకోవడానికి కుస్తీలు పట్టాడు.. అంతకుముందు ఇండియన్ పీపుల్స్ థియేటర్ వారి నాటకాల్లో స్వర్గీయ డాక్టర్ రాజరావుగారి నిర్వహణలో అనేక ప్రదర్శనలో పాల్గోన్నాడు కృష్ణ. ఆ సమయంలో సినిమా నటుడు కావాలనే కోరిక మరింత బలంగా మారిందట. 1960లో మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించినప్పటికీ నిరాశే ఎదురైంది. ఆ తర్వాత ఏడాది అనంతరం బాబూ మూవీస్ ప్రకటనకు దరఖాస్తు చేశాడు.. బాబూ మూవీస్ స్కూల్లోనే నటనకు కావాల్సిన నైపుణ్యాలు, గుర్రపు స్వారీ, కారు డ్రైవింగ్ ఇలా అన్నింటిని నేర్చుకున్నాడు.

Krishna

Krishna

ఆ తర్వాత కన్నె మనసులు చిత్రంలో అద్భుతమైన నటనను కనబరిచాడని.. గూడఛారి 116 సినిమాలో నటనతో మెప్పించాడు.. బహు ముఖ ప్రజ్ఞావంతుడయిన గొప్ప నటుడిగా ఎదగడానికి ఎప్పటికీ ప్రయాత్నిస్తూనే ఉంటాడని అప్పట్లోని కథనంలో ప్రచురితమైంది.. ఇందుకు సంబంధించిన పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. సినీ అరంగేట్రం చేసిన మొదట్లో కృష్ణ ఫోటో చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో సూపర్ స్టార్ కృష్ణకు మరోసారి టీవీ తెలుగు తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు..

ఇవి కూడా చదవండి