Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. సల్మాన్ ఖాన్‌ ఇంటికి బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వరుస బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబైలో తాను ఉంటోన్న బాంద్రా నివాసంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మంగళవారం (జనవరి 08) తన ఇంటికి బుల్లెట్ ఫ్రూప్ గ్లాస్ ను అమర్చారు.

Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. సల్మాన్ ఖాన్‌ ఇంటికి బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌
Salman Khan
Follow us
Basha Shek

|

Updated on: Jan 08, 2025 | 9:14 AM

బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ గత కొన్ని రోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అతని సినిమా సూపర్ హిట్ అయ్యి చాలా రోజులైంది. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలోనూ సల్మాన్ ఇబ్బందుల ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్, అతని సహచరులు సల్మాన్ ఖాన్‌ను చంపుతామంటూ బెదిరిస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సన్నిహితులు, ప్రముఖ రాజకీయ నాయకుడైన బాబా సిద్ధిఖీని బిష్ణోయ్ అనుచరులు హతమార్చారు. సల్మాన్ ఖాన్‌కు పదే పదే బెదిరింపు లేఖలు వస్తున్నాయి. అయినా తన సినిమా షూటింగ్‌ పనులు కొనసాగిస్తున్నాడు. కాగా కొన్ని నెలల క్రితం సల్మాన్ ఖాన్ ఉంటోన్న గెలాక్సీ అపార్ట్ మెంట్ పై కొందరు దుండగులు దాడి చేశారు. అపార్ట్ మెంట్ లోని గాజు కిటికీలపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. మళ్లీ అలాంటి దాడి జరిగే అవకాశం ఉండడంతో ఇప్పుడు సల్మాన్ ఖాన్ తన నివాసానికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమర్చారు. తాజాగా గెలాక్సీ అపార్ట్మెంట్ కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటి భద్రతను కూడా పెంచినట్లు సమాచారం.

గతేడాది సల్మాన్ ఖాన్ తన కారులో కొన్ని భద్రతా మార్పులు కూడా చేశాడు. ప్రస్తుతం బుల్లెట్ ప్రూఫ్ కారును సల్లూ భాయ్ ఉపయోగిస్తున్నాడు. అంతేకాకుండా తమ కార్లన్నింటికీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ అమర్చాడు. ఇక ముంబై పోలీసుల నుండి లైసెన్స్ పొందిన గన్ కూడా తీసుకున్నాడు సల్మాన్. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సల్మాన్ ఖాన్‌కు అదనపు భద్రతను కల్పించింది.

ఇవి కూడా చదవండి

సల్మాన్ ఇంటికి బుల్లెట్ ఫ్రూప్ గ్లాస్ .. వీడియో..

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. తమిళ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిద్ నదియావాలా ఈ మూవీని నిర్మిస్తున్నారు. రంజాన్ పర్వదినం కానుకగా ఈ ఏడాది మార్చి నెలలో సికందర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.