Tollywood: ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లతో తీస్తే 40 వేలు కూడా రాలేదు.. దేశంలోనే చెత్త మూవీ..
సినీరంగంలో హిట్స్, ప్లాప్స్ కామన్. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు ఊహించని విధంగా సూపర్ హిటైన చిత్రాలు ఎక్కువే ఉన్నాయి. అలాగే పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం సంబంధం లేకుండా నిర్మాతలకు నష్టాలు మూటగట్టిన సినిమాలు ఉన్నాయి. అందులో ఈ మూవీ ఒకటి.

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ లేకుండా తక్కువ బడ్జెట్ తో రూపొందించిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. కానీ ఓ సినిమా మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయ్యింది. పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా నిర్మాతలకు పెద్ద షాకిచ్చింది. స్టార్ హీరో.. బడా నిర్మాత కొడుకు హీరోగా తెరకెక్కించిన ఆ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. నిర్మాతలు పెట్టిన పెట్టుబడులలో కేవలం 0.0001 శాతం మాత్రమే కలెక్షన్స్ రాబట్టి ప్రపంచంలోనే అత్యంత చెత్త సినిమాగా నిలిచింది. దాదాపు రూ.45 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా.. కేవలం రూ.45వేలు కలెక్షన్స్ రాబట్టింది. ఆ సినిమా ఏంటో తెలుసా.. లేడీ కిల్లర్. ఈ సినిమా ఇప్పటివరకు పాన్ ఇండియా చరిత్రలోనే అది పెద్ద ప్లాప్ మూవీగా నిలిచింది.
2023 నవంబర్ 3న విడుదలైన లేడీ కిల్లర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ నటించారు. అప్పటికే మలైకా అరోరాతో డేటింగ్ అంటూ నిత్యం వార్తలలో నిలిచిన అర్జున్ కపూర్.. సరైన్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే కెరీర్ లో అత్యంత భారీ డిజాస్టర్ గా ఈ మూవీ నిలిచింది. ఇందులో భూమి ఫడ్నెకర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి అజయ్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు.
దాదాపు రూ.45 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా మొత్తం రూ. 45వేలు వసూళ్లు రాబ్టటింది. ఈ సినిమా మొత్తం 12 షోలు ఆడగా.. మొదటి రోజు రూ.38 వేలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు నెట్ ఫ్లిక్స్ ఓటీటీతో డీల్ కుదిరిందట. కానీ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత ఆ ఢీల్ క్యాన్సిల్ అయ్యిందట.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..