Shreyas Talpade: వందల కోట్ల ఆశ చూపించి గ్రామస్తులను మోసం చేసిన నటుడు.. చివరకు..
తక్కువ సమయంలో లాభాలు ఆర్జిస్తామని చెప్పి గ్రామస్తుల నుండి వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే తన గురించి వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చాడు శ్రేయాస్.

హిందీ, మరాఠీ చిత్రపరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రేయాస్ తల్పాడే. పుష్ప 2 హిందీ వెర్షన్ అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. సహజ నటనపై ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. వందల కోట్ల రూపాయలను మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే, ఇది సినిమా పరిశ్రమకు సంబంధించిన కుంభకోణం కాదు. ఏ నిర్మాతను మోసం కూడా చేయలేదు. కానీ గ్రామస్తులను శ్రేయాస్ తల్పాడే చాలా తెలివిగా మోసం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. వందల కోట్ల కుంభకోణం ఆరోపణల్లో శ్రేయాస్ తల్పడే పై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఉత్తర్ ప్రదేశ్ మహోబ జిల్లాలో చిట్ ఫండ్ పేరుతో గ్రామస్తులను నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిందట ఓ సహకార సంఘం. ప్రజల నుండి డబ్బు తీసుకొని తక్కువ సమయంలో రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత చేతులెత్తేసింది. ఈ మోసం గత దశాబ్ద కాలంగా కొనసాగుతోంది. మోసం వెలుగులోకి వచ్చిన తర్వాత, సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడేతోపాటు మరో 14 మందిపై కేసు నమోదు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను శ్రేయాస్ తల్పాడే ఖండించారు. తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అని.. ఇతర స్టార్స్ లాగే తాను కూడా కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుకుంటానని.. వీలైనప్పుడు ఆ వేడుకలకు వెళ్తుంటానని.. ఆ సహాకార సంఘానికి తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..