AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT 2025: బాలీవుడ్ రాజకీయంగా విడిపోయిందా.. ? హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్..

దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్ వర్క్ టీవీ9 నిర్వహించిన 'వాట్ ఇండియా థింక్స్ టుడే' మూడవ ఎడిషన్ శుక్రవారంగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. ఈ వేడుకలో టీవీ9 టీంపై ప్రశంసలు కురిపించారు. అనంతరం దేశంలోని దశాబ్దాలనాటి సమస్య గురించి.. గత పదేళ్లల్లో జరిగిన విజయాల గురించి మాట్లాడారు. ఇదే కార్యక్రమంలో హీరోయిన్ యామీ గౌతమ్ సైతం పాల్గొన్నారు.

WITT 2025: బాలీవుడ్ రాజకీయంగా విడిపోయిందా.. ? హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్..
Yami Gautham
Rajitha Chanti
|

Updated on: Mar 29, 2025 | 9:26 AM

Share

దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్ వర్క్ టీవీ9 నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ మూడవ ఎడిషన్ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, సినీతారలు పాల్గొన్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భారత ప్రధాని మోదీ పాల్గొని గత పదేళ్లలో దేశంలో జరిగిన కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. అలాగే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పలు విషయాలను పంచుకున్నారు. చిన్న పట్టణం నుంచి వచ్చి.. ముంబై నగరంలో తన సినీప్రయాణం ఎలా సాగిందనే విషయాన్ని చెప్పుకొచ్చింది. పరిశ్రమలో రాణించగలరని నమ్మితే, విజయం ఖచ్చితంగా మీ సొంతమవుతుందని.. ఏమి చేయాలనుకుంటున్నారు ? ఎందుకు పరిశ్రమలోకి రావాలనుకుంటున్నారు ? అనే విషయాలు మీ మనస్సులో స్పష్టంగా ఉండాలని తెలిపింది.

” సినీరంగంలో పోరాటం ఉంటుంది. కానీ పోరాటం తర్వాత ఏమి జరిగినా అది సరైనదే అవుతుంది. సరైన సమయంలో సరైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటేనే విజయం వస్తుంది” అని చెప్పుకొచ్చింది. ఆర్టికల్ 370 సినిమా తీసే అనుభవం ఎలా ఉంది? ఈ 100 కోట్ల సినిమాను మీరే ఎలా విజయవంతం చేశారు? అనే ప్రశ్నలకు స్పందిస్తూ “ఈ సినిమాలో అవకాశం వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ అవార్డు గొప్ప గౌరవం. ఏ నటుడికైనా ఇది చాలా పెద్ద విషయం. నాన్నగారికి గత సంవత్సరం జాతీయ అవార్డు వచ్చింది. నా భర్త కూడా అవార్డు గెలుచుకున్నాడు. కానీ నిజం చెప్పాలంటే, ఇది రచన, ఊహ, అద్భుతమైన రచన. నేను కూడా ఇంతకు ముందు సినిమాలు చేశాను. కానీ ఏ సినిమాలో అతను ఇంత ప్రధాన పాత్ర పోషించలేదు? దీనికి, నేను సినిమా నటీనటులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా భర్త ఆదిత్యకు కూడా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను..” అని అన్నారు.

బాలీవుడ్‌లో రాజకీయ విభజన జరిగిందా ? అని అడగ్గా.. యామిని మాట్లాడుతూ..” ప్రతి ఒక్కరికీ రాజకీయ భావజాలం ఉంటుంది. నేను ఒక ప్రజా వ్యక్తిని, కానీ నేను ఒక దేశ పౌరుడిని కూడా. దీని గురించి మాట్లాడాలా వద్ద అనేది వ్యక్తిగత నిర్ణయం. నటిగా నేను నిష్పాక్షికంగా పని చేయాలనుకుంటున్నాను. ఆర్టికల్ 370 విషయంలోనూ నేను అదే చేశాను. నా రాబోయే సినిమా, దాని టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. ఆ విషయంలో కూడా నా విధానం ఇదే ” అంటూ చెప్పుకొచ్చింది.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..