Sara Ali Khan: మళ్లీ కలుస్తోన్న ప్రేమ పక్షులు.. సారాతో కలిసి భయపెడతానంటోన్న కార్తీక్ ఆర్యన్
గతంలో సారా అలీఖాన్, కార్తీక్ ఆర్యన్ జంటగా నటించిన చిత్రం ‘లవ్ ఆజ్ కల్’. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడినట్లు సమాచారం. అయితే ఏమైందో కానీ ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు మళ్లీ కార్తీక్- సారా అలీఖాన్ జంటగా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్‌లో ‘భూల్ భూలయ్య’, ‘భూల్ భూలయ్య 2’ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో వచ్చిన చంద్రముఖి సినిమాల స్ఫూర్తితోనే వీటినే తెరకెక్కించాడు. ఇప్పుడు భూల్ భూలయ్య సిరీస్‌లో మూడో భాగాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి భాగంలో అక్షయ్ కుమార్ నటించాడు. ‘భూల్ భూలయ్య 2’ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మూడో భాగంలో కూడా కార్తీక్ ఆర్యన్ నటించడం ఖాయం. విశేషమేమిటంటే ‘భూల్ భూలయ్యా 3’ చిత్రంలో సారా అలీఖాన్ జోడీగా నటిస్తుందనే గాసిప్‌లు వినిపిస్తున్నాయి. గతంలో సారా అలీఖాన్, కార్తీక్ ఆర్యన్ జంటగా నటించిన చిత్రం ‘లవ్ ఆజ్ కల్’. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడినట్లు సమాచారం. అయితే ఏమైందో కానీ ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు మళ్లీ కార్తీక్- సారా అలీఖాన్ జంటగా నటించనున్నారనే వార్తలు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. హారర్ థ్రిల్లర్ ‘భూల్ భూలయ్య 3’కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2024 ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2024 దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావించినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది.
భూషణ్ కుమార్ ‘భూల్ భూలయ్య 3’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించనున్నారు. కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ మళ్లీ జంటగా నటించేందుకు ఉత్సాహంగా ఉన్నారని, సరిగ్గా 3 నెలల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశామంటున్నారు మేకర్స్. త్వరలోనే తమ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇస్తామంటున్నారు. మరోవైపు తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సారా అలీఖాన్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైందని గుస గులు వినిపిస్తున్నాయి.
కుటుంబ సభ్యులతో సారా అలీఖాన్..
View this post on Instagram
డేవిడ్ బెక్ హమ్ తో సారా అలీఖాన్
View this post on Instagram
అమర్ నాథ్ యాత్రలో సారా అలీఖాన్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.