అల్లు శిరీష్, నయనిక వివాహ తేదీ ఖరారైంది. మార్చి 6న వారి పెళ్లి జరగనుంది. ఇటీవల నిశ్చితార్థం తర్వాత, అల్లు శిరీష్ ఇన్స్టాగ్రామ్లో అయాన్, అర్హలతో కలిసి ఈ తేదీని వెల్లడించారు. అల్లు అర్జున్-స్నేహా రెడ్డి పెళ్లిరోజు కూడా మార్చి 6నే కావడం విశేషం. పెళ్లి వేదికపై ఇంకా స్పష్టత లేదు.