Kiara Advani: ఈఏడాది ఆమే నెంబర్ వన్.. గూగులే చెప్పేసింది.. ఇంతకు ఎందులో అంటే
ఇదే ఏడాది కియారా అద్వానీ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ చాలా ఏళ్లగా సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేసింది. ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ చాలా సార్లు కెమెరాకు చిక్కారు. ఎట్టకేలకు ఈ ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీగా కియారా నిలిచింది.
బాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన హీరోయిన్ కియారా అద్వానీ . ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ అమ్మడు. తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఈ సంవత్సరంఈ అమ్మడికి చాలా ప్రత్యేకం. ఇదే ఏడాది కియారా అద్వానీ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ చాలా ఏళ్లగా సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేసింది. ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ చాలా సార్లు కెమెరాకు చిక్కారు. ఎట్టకేలకు ఈ ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీగా కియారా నిలిచింది. దీనికి సంబంధించిన లిస్ట్‌ను గూగుల్ విడుదల చేసింది.
2023 సంవత్సరం మరికొద్దిరోజుల్లో ముగిసిపోనుంది. దాంతో ఈ ఏడాదిలో జరిగిన చాలా విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది ఇండియన్స్ గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీ కియారా. ఈ సంవత్సరం ఈ చిన్నది వివాహం చేసుకుంది. దాంతో ఆమె పేరు ఎక్కువగా సెర్చ్ చేసి ఉండొచ్చని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకకియారా భర్త సిద్దార్థ్ ఆరో స్థానంలో ఉన్నాడు.
కియారా పాపులారిటీ కేవలంఇండియాలోనే కాదు.. ప్రపంచ స్థాయిలోనూ ఆమె పేరు అగ్రస్థానంలో ఉంది. ఈ సంవత్సరం అత్యధికంగా వెతికిన నటీమణులలో కియారా కూడా ఉన్నారు. చాలా మంది హాలీవుడ్ హీరోయిన్లను అధిగమించింది ఈ బ్యూటీ. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, అలియా భట్ ఈ వరుసలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కియారా అద్వానీ పెళ్లి రాజస్థాన్‌లో గ్రాండ్‌గా జరిగింది. కియారా బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది. ఆయన నటించిన ‘సత్య ప్రేమ్ కి కథ’ చిత్రం విడుదలైంది.
View this post on Instagram
కియారా అద్వానీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
కియారా అద్వానీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.