ఇదేందయ్యా ఇది.. స్టార్ హీరోలను కూడా వెనక్కి నెట్టేసిన సోషల్ మీడియా బ్యూటీ

కొంతమంది తమలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టి పేరు తెచుకుంటుంటే.. మారికొంతమంది పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఫెమస్ అవుతున్నారు. ఇక కొంతమంది అందాల భామలు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియా పుణ్యమా అని హీరోయిన్స్ కూడా అయ్యారు. మరికొంతమంది టీవీ షోల్లో, సీరియల్స్ లో ఛాన్స్ లు అందుకుంటున్నారు.

ఇదేందయ్యా ఇది.. స్టార్ హీరోలను కూడా వెనక్కి నెట్టేసిన సోషల్ మీడియా బ్యూటీ
Jannat Zubair Rahmani
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 12, 2023 | 5:47 PM

సోషల్ మీడియా వల్ల చాలా మంది విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఎవరు ఎందుకు పాపులర్ అవుతున్నారో.. అర్ధం కావడంలేదు. కొంతమంది తమలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టి పేరు తెచుకుంటుంటే.. మారికొంతమంది పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఫెమస్ అవుతున్నారు. ఇక కొంతమంది అందాల భామలు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియా పుణ్యమా అని హీరోయిన్స్ కూడా అయ్యారు. మరికొంతమంది టీవీ షోల్లో, సీరియల్స్ లో ఛాన్స్ లు అందుకుంటున్నారు. ఇక చాలా మంది సోషల్ మీడియా ద్వారా కోట్లు కూడా సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు.

ఈ అమ్మడు ఏకంగా అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్ లను కూడా బీట్ చేసింది ఈ చిన్నది. ఆ అమ్మడి పేరు జన్నత్ జుబేర్ రహ్మానీ. ఈ చిన్నది టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితురాలు ఈ బ్యూటీ. ఏడేళ్ల వయసులో బుల్లితెర నటించింది జన్నత్ జుబేర్ రహ్మానీ. ఆతర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జన్నత్ జుబేర్ రహ్మానీ నటిగా, సింగర్‌ గా, టిక్ టాక్ స్టార్‌ గా, యాంకర్‌ గా చేసింది.

ఇప్పుడు ఈ బ్యూటీకి 22 ఏళ్లు. ఈ అమ్మడు కేవలం సోషల్ మీడియా పోస్ట్ లతోనే రూ. 25 కోట్లు వసూల్ చేసింది ఈ చిన్నది.  స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టేసింది ఈ చిన్నది. కేవలం సోషల్ మీడియా పోస్ట్ లతోనే కోట్లు సంపాదిస్తుంది జన్నత్ జుబేర్ రహ్మానీ. అంతే కాదు ఈ చిన్నదానికి ఇన్ స్టా గ్రామ్ లో 48 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు కూడా ఇంతమంది ఫాలోవర్స్ లేరు. అందం అభినయంతో పాటు సింగర్ గాను రాణిస్తున్న ఈ చిన్నది. సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది జన్నత్ జుబేర్ రహ్మానీ.

జన్నత్ జుబేర్ రహ్మానీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.