ఈ ఏడాది ఎక్కువ మంది గూగుల్‌లో గాలించిన సినిమా ఎదో తెలుసా..?

'పఠాన్', 'జవాన్',సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. బాక్సాఫీస్‌లోనే కాకుండా గూగుల్ సెర్చ్ లో కూడా షారుక్ ఖాన్ నంబర్ వన్ స్థానాన్ని పొందారు . 2023లో భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఈ జాబితాలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన సినిమా నంబర్‌ 1 స్థానంలో నిలిచింది.

ఈ ఏడాది ఎక్కువ మంది గూగుల్‌లో గాలించిన సినిమా ఎదో తెలుసా..?
Google
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 12, 2023 | 8:44 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్‌కు 2023 సంవత్సరం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి . ఈ ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ‘పఠాన్’, ‘జవాన్’,సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. బాక్సాఫీస్‌లోనే కాకుండా గూగుల్ సెర్చ్‌లో కూడా షారుక్ ఖాన్ నంబర్ వన్ స్థానాన్ని పొందారు . 2023లో భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఈ జాబితాలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన సినిమా నంబర్‌ 1 స్థానంలో నిలిచింది.

షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. జవాన్ సినిమాకు సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించారు. ఈ సినిమాకు సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ క్రేజ్ వచ్చింది. జవాన్ తరహా కథలు మనదగ్గర చాలానే వచ్చాయి. కానీ హిందీ ఆడియన్స్ కు మాత్రం కొత్తగా అనిపించింది. అక్కడ భారీ విజయం అందుకుంది. 2023లో మరో సూపర్ హిట్ చిత్రం ‘గదర్ 2’ రెండో స్థానంలో నిలిచింది. విడుదలకి ముందు దుమారం రేపిన క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఓపెన్‌హైమర్’ చిత్రానికి 3వ స్థానం లభించింది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష’ చిత్రం 4వ స్థానంలో నిలిచింది. 5వ స్థానంలో ‘పఠాన్’, 6వ స్థానంలో ‘ది కేరళ స్టోరీ’, 7వ స్థానంలో రజనీకాంత్ ‘జైలర్’ ఉన్నాయి.

8వ స్థానంలో దళపతి విజయ్ చిత్రం ‘లియో’ ఉంది. సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ 9వ స్థానంలో ఉంది. ‘వారిసు’(వారసుడు) సినిమా 10వ స్థానంలో నిలిచింది. అలాగే 2023లో అత్యధికంగా శోధించిన టీవీ షోలు , వెబ్ సిరీస్‌లు: 1. ఫెర్గీ 2. థర్స్ డే 3. అసుర్ 4. రానా నాయుడు 5. ది లాస్ట్ ఆఫ్ అస్ 6. స్కామ్ 2003 7. బిగ్ బాస్ 17(హిందీ) 8. గన్స్  అండ్ గులబ్స్  9. సెక్స్/లైఫ్ 10. తాజా ఖబర్ నిలిచాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..