AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cauliflower Hacks: కాలీఫ్లవర్ కొంటున్నారా? ఈ 3 విషయాలు గమనించకపోతే పురుగులు తిన్నట్టే!

మార్కెట్‌కు వెళ్లినప్పుడు తెల్లగా, పెద్దగా కనిపిస్తోందని కాలీఫ్లవర్‌ను కొనేస్తున్నారా? అయితే మీరు పొరపాటే చేస్తున్నారు. కాలీఫ్లవర్ కొన్నప్పుడు పైన బాగానే ఉన్నా, లోపల చిన్న చిన్న పురుగులు ఉండటం చాలామందిని ఇబ్బంది పెట్టే అంశం. నాణ్యమైన, పురుగులు లేని కాలీఫ్లవర్‌ను గుర్తించడం ఎలా? కూరగాయలు కొనడంలో మీరు కూడా నిపుణులు కావాలంటే ఈ చిట్కాలు తప్పక తెలుసుకోండి.

Cauliflower Hacks: కాలీఫ్లవర్ కొంటున్నారా?  ఈ 3 విషయాలు గమనించకపోతే పురుగులు తిన్నట్టే!
Cauliflower Buying Tips
Bhavani
|

Updated on: Dec 30, 2025 | 1:55 PM

Share

గోబీ మంచూరియన్ లేదా కాలీఫ్లవర్ కర్రీ చేయాలని ఆశగా తెచ్చుకున్న పువ్వులో పురుగులు కనిపిస్తే తినాలనే కోరిక చచ్చిపోతుంది. కేవలం పరిమాణాన్ని చూసి మోసపోకుండా, అసలైన తాజాగా ఉండే కాలీఫ్లవర్‌ను ఎలా ఎంచుకోవాలో ఈ కథనం వివరిస్తుంది. అలాగే కాలీఫ్లవర్‌పై ఉండే రసాయనాలను, లోపల దాగి ఉండే పురుగులను వదిలించే అద్భుతమైన క్లీనింగ్ పద్ధతి ఇప్పుడు చూద్దాం.

కాలీఫ్లవర్ వంటకాలు ఎంత రుచిగా ఉంటాయో, వాటిని శుభ్రం చేయడం అంత కష్టమైన పని. మార్కెట్లో దొరికే కుప్పల్లో నుంచి మంచి పువ్వును ఎంచుకోవడానికి ఈ క్రింది సూత్రాలు పాటించండి:

పరిమాణం కంటే సాంద్రత ముఖ్యం: చాలామంది పెద్ద పువ్వు కనిపిస్తే వెంటనే కొనేస్తారు. కానీ కాలీఫ్లవర్ విషయంలో పరిమాణం కంటే అది ఎంత గట్టిగా ఉందనేది చూడాలి. పువ్వు రేకులు ఒకదానికొకటి చాలా దగ్గరగా, గట్టిగా ఉండాలి. వాటి మధ్య ఖాళీలు ఉంటే పురుగులు సులభంగా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. రాయిలా గట్టిగా ఉండే పువ్వును ఎంచుకోవడం ఉత్తమం.

రంగును గమనించండి: మంచి నాణ్యత గల కాలీఫ్లవర్ లేత క్రీమ్ లేదా లేత పసుపు రంగులో ఉండాలి. పువ్వుపై ఎక్కడైనా ముదురు మచ్చలున్నా, రంగు మారినా దానిని పక్కన పెట్టేయండి. పువ్వులు విడివిడిగా విస్తరించి కనిపిస్తే అది ముదిరిపోయిందని అర్థం. అలాంటివి వండినప్పుడు రుచిగా ఉండవు.

మధ్యస్థ పరిమాణమే మేలు: అతి పెద్ద పువ్వులు తక్కువ రుచిని కలిగి ఉంటాయి. మరీ చిన్నవి కాకుండా, మధ్యస్థ పరిమాణంలో ఉండే కాలీఫ్లవర్‌లు వంటకు మృదువుగా, రుచిగా ఉంటాయి.

క్లీనింగ్ టిప్స్ – పురుగులను వదిలించండిలా: కాలీఫ్లవర్‌పై పురుగుమందుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని కేవలం చల్లటి నీటితో కడగడం సరిపోదు:

కాలీఫ్లవర్‌ను ముక్కలుగా కోసిన తర్వాత ఒక పాత్రలో నీటిని మరిగించండి.

అందులో ఒక గుప్పెడు రాతి ఉప్పు వేయండి.

మరుగుతున్న నీటిలో ఈ ముక్కలను వేసి స్టవ్ ఆపేయండి.

ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. దీనివల్ల లోపల దాగి ఉన్న కనిపించని పురుగులు చనిపోయి నీటిపై తేలుతాయి. అలాగే ఉపరితలంపై ఉన్న రసాయనాలు కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత చల్లటి నీటితో మరోసారి కడిగి వంటకు ఉపయోగించండి.