AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malai Paneer Recipe: ఇంట్లో పనీర్ ఉందా? రొటీన్ కూరలు పక్కన పెట్టి.. ఈ రాయల్ ‘మలై పనీర్’ ట్రై చేయండి

పనీర్ వంటకాల్లో పనీర్ బటర్ మసాలా వంటివి అందరికీ సుపరిచితమే. అయితే, నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే 'మలై పనీర్' రుచి ఎప్పుడైనా చూశారా? తెల్లటి గ్రేవీతో చూడ్డానికి రాజసం ఉట్టిపడుతూ.. అదిరిపోయే సువాసనతో ఉండే ఈ కర్రీని చాలామంది స్వీట్‌గా ఉంటుందని భావిస్తుంటారు. కానీ, మనం తయారుచేసుకోబోయే ఈ వంటకం కొంచెం ఘాటుగా, అద్భుతమైన రుచితో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ తయారీ విధానం ఇక్కడ చూడండి.

Malai Paneer Recipe:  ఇంట్లో పనీర్ ఉందా? రొటీన్ కూరలు పక్కన పెట్టి.. ఈ రాయల్ 'మలై పనీర్' ట్రై చేయండి
Malai Paneer Preparation
Bhavani
|

Updated on: Dec 30, 2025 | 3:03 PM

Share

హోటల్ స్టైల్‌లో దొరికే తెల్లటి పనీర్ గ్రేవీ కర్రీని ఇంట్లోనే పక్కాగా చేయడం ఎలాగో తెలుసా? పనీర్ ముక్కలను నేరుగా గ్రేవీలో వేయకుండా, ఒక చిన్న ట్రిక్ ఉపయోగించి వేయించడం వల్ల దీని రుచి రెట్టింపు అవుతుంది. రోటీ, నాన్, పులావ్ వంటి వాటిలోకి అత్యంత అద్భుతమైన కాంబినేషన్ ఈ మలై పనీర్. ఈ వంటకం తయారీలోని రహస్యాలు మీకోసం.

కావలసిన వస్తువులు:

పనీర్ (250 గ్రాములు), నెయ్యి లేదా వెన్న.

మారినేషన్ కోసం: గట్టి పెరుగు (పావు కప్పు),

అల్లం వెల్లుల్లి ముద్ద,

మిరియాల పొడి,

గరం మసాలా,

కసూరీ మేతీ,

రుచికి సరిపడా ఉప్పు.

మసాలా పేస్ట్: పసుపు రంగు ఉల్లిపాయలు (2 కప్పులు), అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు (పావు కప్పు), పాలు.

సువాసన కోసం: యాలకులు, నల్ల యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, పచ్చిమిర్చి, జాజికాయ పొడి, ఫ్రెష్ క్రీమ్.

తయారీ పద్ధతి:

మారినేషన్ ప్రక్రియ: పనీర్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని పైన చెప్పిన మారినేషన్ పదార్థాలన్నీ పట్టించాలి. దీనిని కనీసం అరగంట పాటు పక్కన పెట్టాలి.

గ్రేవీ బేస్: బాణలిలో కొద్దిగా నూనె పోసి యాలకులు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇవి రంగు మారకుండా 8 నిమిషాలు వేయించి.. కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. ఇవి చల్లారాక జీడిపప్పు, పాలు కలిపి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

వంట విధానం: ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి మసాలా దినుసులు, పచ్చిమిర్చి వేయించాలి. సిద్ధం చేసిన పేస్ట్, 1.5 కప్పుల నీళ్లు పోసి సుమారు 12 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. గ్రేవీ సాఫీగా మారిన తర్వాత గరం మసాలా, జాజికాయ పొడి, ఉప్పు, కసూరీ మేతీ చేర్చాలి.

పనీర్ ఫ్రై: వేరే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి మారినేట్ చేసిన పనీర్ ముక్కలను దోరగా వేయించాలి.

గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఫ్రెష్ క్రీమ్, వేయించిన పనీర్ ముక్కలు వేసి కలిపి ఒక్క నిమిషం ఉంచి దించేయాలి.

సూచనలు:

ఎర్ర ఉల్లిపాయలు వాడితే గ్రేవీ రంగు మారుతుంది.. కాబట్టి తెల్లటి లేదా పసుపు రంగు ఉల్లిపాయలనే వాడండి.

గ్రేవీని పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడికించడం చాలా ముఖ్యం.

గ్రేవీ చల్లారాక గట్టిపడుతుంది కాబట్టి.. కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేయాలి.