Video: షాకింగ్ ఓటమి.. చిన్న తప్పుతో 12 ఏళ్ల బాలుడి చేతిలో గుకేష్ ఘోర పరాజయం..!
World Blitz Chess Championship 2025: సాధారణంగా క్లాసికల్ చెస్‌లో అత్యంత పటిష్టమైన ఆటగాడిగా పేరున్న గుకేష్‌కు, ఫాస్ట్ ఫార్మాట్ అయిన బ్లిట్జ్ ఎప్పుడూ ఒక సవాలుగానే ఉంటోంది. ఈ ఓటమి ఆయనకు ఒక హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో గుకేష్ తిరిగి ఫామ్‌లోకి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

World Blitz Chess Championship 2025: ప్రపంచ చెస్ రంగంలో సరికొత్త సంచలనం సృష్టించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ డి.గుకేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో కేవలం 12 ఏళ్ల రష్యన్ బాలుడు సెర్గీ స్క్లోకిన్ చేతిలో గుకేష్ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. గెలిచే స్థితిలో ఉండి కూడా ఒక చిన్న పొరపాటు కారణంగా గుకేష్ ఈ మ్యాచ్‌ను కోల్పోవడం ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశమైంది.
ఇటీవలే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత స్టార్ డి.గుకేష్, బ్లిట్జ్ ఫార్మాట్‌లో మాత్రం తడబడ్డడు. ఉజ్బెకిస్థాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్-2025లో ఒక ఆశ్చర్యకరమైన ఫలితం నమోదైంది. ఎంతో అనుభవం, అత్యున్నత రేటింగ్ ఉన్న గుకేష్‌ను 12 ఏళ్ల సెర్గీ స్క్లోకిన్ ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఆ ఒక్క పొరపాటే కొంపముంచింది..
బ్లిట్జ్ చెస్ అంటేనే సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి గుకేష్ పైచేయి సాధించినట్లు కనిపించినా, సమయం తక్కువగా ఉన్న తరుణంలో ఆయన ఒక భారీ ‘బ్లండర్’ (పెద్ద తప్పు) చేశాడు. దీనిని చక్కగా వినియోగించుకున్న చిన్నారి సెర్గీ, గుకేష్‌ను ఆత్మరక్షణలో పడేశాడు. ఒత్తిడిని దరిచేరనీయకుండా సెర్గీ ఆడిన తీరు చూసి అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. చివరికి తన ఓటమిని అంగీకరిస్తూ గుకేష్ బోర్డుపై నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
వైరల్ అవుతున్న వీడియో..
12-year-old FM Sergey Skolkin takes down World Champion D Gukesh in World Blitz Championship . . Edit: Tushar Damor Video: @adityasurroy21#chess #chessbaseindia pic.twitter.com/I7Bdj3mj9d
— ChessBase India (@ChessbaseIndia) December 29, 2025
ఈ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గుకేష్ చేసిన ఆ తప్పును చూసి ఆయన కూడా ఒక్క క్షణం షాక్‌కు గురవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం 12 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ స్థాయి ఆటగాడిని ఓడించిన సెర్గీ స్క్లోకిన్‌ను చెస్ దిగ్గజాలు ప్రశంసిస్తున్నారు.
క్రీడల్లో ఎప్పుడైనా, ఎవరైనా ఓడిపోవచ్చు అనడానికి ఈ మ్యాచ్ ఒక నిదర్శనం. 12 ఏళ్ల సెర్గీ విజయం చెస్ ప్రపంచంలో యువ ప్రతిభ ఏ స్థాయిలో ఉందో చాటి చెప్పింది. గుకేష్ ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి రౌండ్లలో ఎలా పుంజుకుంటారో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




