ఘనంగా వైకుంఠ ఏకాదశి.. అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తుడు అన్నమయ్య రాసిన కీర్తనల అక్షరాలతో అ దేవదేవుడి చిత్రాన్ని చిత్రకారుడు అద్బతంగా మలిచాడు. చిత్రకారుడు ప్రతిభను వెంకటేశ్వర స్వామి భక్తులు, ప్రముఖులు ప్రశంసించారు.

ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ చిత్రం వేశామని అన్నారు. ఈ చిత్రాన్ని వెయ్యడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టిందన్నారు. ఏ3 డ్రాయింగ్ షీట్‌పై ఎలాంటి గీతలు లేకుండా కలర్ పెన్, వాటర్ కలర్స్ మాత్రమే వాడినట్లు తెలిపారు. అంతే కాకుండా మహా విష్ణువుకు వైకుంఠ ఏకాదశి అంటే ఎంతో ప్రీతికరమైన రోజు అని, మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠంకు వెళ్లి మహా విష్ణువును పూజిస్తారని అందుకే ఈ రోజును ముక్కోటి ఏకాదశి అంటారని అన్నారు.
ఈరోజున మహా విష్ణువు వైకుంఠం నుండి గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి భక్తులకు దర్శన ఇస్తారని పురాణాలు చెబుతున్నాయి.శ్రీ మహా విష్ణువు ఒకొక్క యుగంలో ఒక రూపంలో దర్శనం ఇచ్చాడని అందులో భాగంగా త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో శ్రీవెంకటేశ్వరునిగా అవతరించారని గుర్తు చేశారు. ఎంతో పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు సహస్ర నామ విష్ణు పారాయణం, గోవింద నామ స్మరణ చేయడం, వైష్ణవ ఆలయాలను సందర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయని నానుడి..!
వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తుడైన అన్నమయ్య పూర్తి పేరు తాళ్లపాక అన్నమాచార్యులు. అయన తెలుగు సాహిత్యంలో తొలి వాగ్గేయకారుడు, పద కవిత పితామహులు. దాదాపుగా వెంకటేశ్వర స్వామి పై 32 వేల కీర్తనలు రచించి తెలుగు భాషా మాధుర్యాన్ని, భక్తిని ప్రపంచానికి చాటాడు. ఎంతో పరిపూర్ణ మైన అన్నమయ్య తెలుగు వారిగా పుట్టడం తెలుగు వారికి ఒక వరం. ఆ కారణజన్ముడు పాడిన కొన్ని కీర్తనలతో మన తెలుగు అక్షరాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రం వేసాను. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రాలు వేస్తూనే వున్నాను. ఈ సారి ఇలా వినూత్నంగా వేసాను. హిందు భక్తులందరికి ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని చిత్రకారుడు కోరారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..