Tollywood : మాజీ ముఖ్యమంత్రి మనవరాలు.. 28 ఏళ్లకే కోట్ల ఆస్తులు.. అయినా హిట్టు కోసం ఎదురుచూపులే..
ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సరైన హిట్టు కోసం ఎదురుచూపులు చూస్తోంది. ఆమె మాజీ ముఖ్యమంత్రికి మనవరాలు. ఆమె తండ్రి ఫేమస్ ఇంజనీర్. 28 ఏళ్ల వయసులోనే కోట్లు సంపాదించిన ఈ హీరోయిన్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే.

ఆమె మాజీ ముఖ్యమంత్రి మనవరాలు. తండ్రి ఫేమస్ ఇంజనీర్. ప్రస్తుతం 28 ఏళ్ల వయసులోనే కోట్ల ఆస్తులకు వారసురాలు. ఆమె ఇప్పటివరకు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాలో నటించింది. అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె ప్రముఖ బ్రాండ్ నైకాకు అంబాసిడర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. నటిగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఇప్పటికీ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ శార్వారీ వాఘ్. ముంబైలోని మరాఠీ కుటుంబంలో జన్మించిన శార్వారీ వాఘ్ రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తాత మనోహర్ జోషి మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..
ఇక శార్వారీ తండ్రి ముంబైలో ప్రసిద్ధ ఆర్కిటెక్ట్.. కాగా తల్లి నమ్రతా సైతం ఆర్కిటెక్ట్. అలాగే శార్వారీ సోదరి సైతం ఆర్కిటెక్ట్ కావడం విశేషం. తమ కుటుంబం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఏకైక హీరోయిన్ తనే. 2020లో, కబీర్ ఖాన్ వెబ్ సిరీస్ ‘ది ఫర్గాటెన్ ఆర్మీ’తో శార్వారీ వాఘ్ తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. 2021లో బందీ ఔర్ బబ్లి 2, సోనియా బబ్లి రావత్, ముంజ్యా, మహారాజ్, వేద వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. నివేదికల ప్రకారం శార్వారీ ఆస్తులు రూ.1.50 కోట్లు. వేద సినిమాకు దాదాపు రూ.50 లక్షలు పారితోషికం తీసుకుంది.
ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..
సినిమాలతోపాటు అనేక వాణిజ్య ప్రకటనలలో కనిపించింది. ఒక్కో యాడ్ కోసం లక్షల రూపాయాలు పారితోషికం తీసుకుంటుంది. నటిగా కంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా శార్వారీ చేసిన సినిమాలే ఎక్కువ. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది ఈ అమ్మడు. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..







