Tollywood: మహాలక్ష్మి ఇంటికొచ్చింది.. తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మ శుభవార్త చెప్పింది. తాను తల్లిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు, నెటిజన్లు ఈ అందాల తారకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

హిందీతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించిన మాళవికా రాజ్ శుభవార్త చెప్పింది. తాను తల్లైనట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 2023లో ప్రణవ్ బగ్గాను పెళ్లాడిన ముద్దుగుమ్మ మాళవిక సోమవారం (ఆగస్టు 25) పండంటి మహా లక్ష్మికి జన్మనిచ్చినట్లు ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు, నెటిజన్లు మాళవిక- ప్రణవ్ బగ్గా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాళవికా రాజ్ మరెవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు జగదీశ్ రాజ్ మనవరాలు. అలాగే బాబీ రాజ్ కుమార్తె. ప్రముఖ నటి అనితా రాజ్ మేనకోడలు కూడా. ఇలా వీరి అడుగు జాడల్లోనే నడిచినప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది మాళవిక.
చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన మాళవిక రాజ్ 2001లో విడుదలైన సూపర్ హిట్ అయిన ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో ఆమె పోషించిన పూజా పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ‘స్క్వాడ్’ అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించిన ఈ అందాల తార కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘K3G’ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. 2017లో రిలీజైన టాలీవుడ్ చిత్రం జయదేవ్‌లో కూడా ఓ కీలక పాత్రలో తళుక్కుమంది. ఇటీవలే స్ట్రీమింగ్ కు వచ్చిన క్రైమ్-థ్రిల్లర్ సిరీస్ ‘స్వైప్ క్రైమ్’లోనూ ఓ ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది.
భర్త ప్రణవ్ బగ్గాతో మాళవిక రాజ్..
View this post on Instagram
సినిమా కెరీర్ ఫుల్ స్పీడ లో ఉండగానే ప్రముఖ వ్యాపార వేత్త ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడింది మాళవిక. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత పెద్దల అనుమతితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఈ ఏడాది మేలో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఆ మధ్యన మాళవిక సీమంతం కూడా గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు పండంటి బిడ్డను ప్రసవించినట్లు శుభవార్త చెప్పిందీ అందాల తార.
మాళవికా రాజ్ సీమంతం వీడియో..
View this post on Instagram
భర్తతో కలిసి రొమాంటిక్ గా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







