Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అదరగొడుతోన్న స్పై యాక్షన్ థ్రిల్లర్.. మొదటి వారంలోనే 9.5 మిలియన్ల స్ట్రీమింగ్ అవర్స్.. తెలుగులోనూ..

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో దుమ్ము రేపుతోంది. దేశ భక్తి నేపథ్యంలో ఆద్యంతం ఎంగేజింగ్ గా ఈ సిరీస్ రికార్డు స్ట్రీమింగ్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది.

OTT Movie: అదరగొడుతోన్న స్పై యాక్షన్ థ్రిల్లర్.. మొదటి వారంలోనే  9.5 మిలియన్ల స్ట్రీమింగ్ అవర్స్.. తెలుగులోనూ..
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 24, 2025 | 7:08 PM

Share

ఈ శుక్రవారం పలు కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన మూవీస్, సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటన్నిటికంటే ముందు స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా వచ్చిన ఓ వెబ్ సిరీస్ ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. దేశ భక్తి భావంతో ఆద్యంతం ఎంగేజింగ్ గా సాగే ఈ సిరీస్ రికార్డు స్ట్రీమింగ్ వ్యూస్ తో దూసుకెళ్లిపోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ డేటా ప్రకారం ఈ సిరీస్ కు ఫస్ట్ వీక్ లో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఓటీటీలో మోస్ట్ వాచ్డ్ నాన్ ఇంగ్లిష్ షోలో ఏకంగా అయిదో స్థానానికి ఎగబాకింది. అంతేకాదు మొదటి వీక్ లో ఈ సిరీస్ 2.3 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అలాగే 9.5 మిలియన్ల స్ట్రీమింగ్ అవర్స్ ను నమోదు చేసింది. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అత్యంత సక్సెస్ ఫుల్ హిందీ సిరీస్ లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం టాప్-5లో ట్రెండ్ అవుతోన్న ఈ సిరీస్ కథ విషయానికి వస్తే..

1966లో జరిగిన విమాన ప్రమాదంలో ఇండియన్ లెజెండరీ సైంటిస్ట్ హోమి బాబా మరణంతో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 1971 ఇండియా- పాక్ యుద్ధంలో ఇద్దరు స్పైలు ఎదిగిన తీరు, 1992 స్కామ్ ను వెలుగులోకి తేవడం, పాకిస్థాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను నాశనం చేయడం లాంటి కథలతో ఈ సిరీస్ సాగుతుంది. ఇందులో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కోటి 40 నిమిషాల నిడివి ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్ సిరీస్ పేరు సారే జహాసే అచ్చా. 1992 స్కామ్ సిరీస్ తో ఓవర్ నైట్ స్టార్ అయిన ప్రతీక్ గాంధీ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే సన్నీ హిందూజ, సుహైల్ నాయర్, తిలోత్తమ షోమ్, అనూప్ సోని తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. సెజల్ షా, భావేశ్ మండాలియా సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్ కు సుమిత్ పురోహిత్ దర్శకత్వం వహించారు.

సారే జహాసే అచ్చా వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉలిక్కపడ్డ అనకాపల్లి.. నగరంలో అనుమానంగా ఇద్దరు విదేశీయుల సంచారం
ఉలిక్కపడ్డ అనకాపల్లి.. నగరంలో అనుమానంగా ఇద్దరు విదేశీయుల సంచారం
బాలీవుడ్‌ టు టాలీవుడ్.. తెలుగు డైరెక్టర్‌‌కు షారుఖ్‌ ఓకే
బాలీవుడ్‌ టు టాలీవుడ్.. తెలుగు డైరెక్టర్‌‌కు షారుఖ్‌ ఓకే
చిన్న అరుణాచలం ఆలయంలో అపశృతి.. మంటలు చెలరేగి ఇద్దరికి గాయాలు
చిన్న అరుణాచలం ఆలయంలో అపశృతి.. మంటలు చెలరేగి ఇద్దరికి గాయాలు
మీలో ఈ 4లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్‌తీసుకోవద్దు.
మీలో ఈ 4లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్‌తీసుకోవద్దు.
‘వరల్డ్ బెస్ట్ వర్క్ ప్లేసెస్‌’.. లిస్ట్‌లో కంపెనీలు ఇవే
‘వరల్డ్ బెస్ట్ వర్క్ ప్లేసెస్‌’.. లిస్ట్‌లో కంపెనీలు ఇవే
సోకాల్డ్ ఐరన్‌ లేడీ షేక్ హసీనాకు మరణదండన
సోకాల్డ్ ఐరన్‌ లేడీ షేక్ హసీనాకు మరణదండన
గ్యాస్ స్టవ్ దగ్గర ఈ 6 వస్తువులను అస్సలు ఉంచకూడదు..
గ్యాస్ స్టవ్ దగ్గర ఈ 6 వస్తువులను అస్సలు ఉంచకూడదు..
చలికాలంలో షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే.. ఈ విషయాలు తప్పనిసరి..!
చలికాలంలో షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే.. ఈ విషయాలు తప్పనిసరి..!
గాల్లోకి ఏ డ్రోన్ ఎగిరినా భయపడాల్సిందేనా?.. NIA దర్యాప్తులో
గాల్లోకి ఏ డ్రోన్ ఎగిరినా భయపడాల్సిందేనా?.. NIA దర్యాప్తులో
బ్యాంక్ జాబ్‌కు రిజైన్ చేసి సినిమాల్లోకి.. ఇప్పుడు తోపు యాక్టర్
బ్యాంక్ జాబ్‌కు రిజైన్ చేసి సినిమాల్లోకి.. ఇప్పుడు తోపు యాక్టర్