- Telugu News Photo Gallery Cinema photos Aadhi Pinisetty and Nikki Galrani Perform Varalaxmi Pooja At Home, See Photos
Aadhi Pinisetty: జంట ఎంత బాగుందో! వరలక్ష‍్మీ వ్రతం చేసిన టాలీవుడ్ హీరో, హీరోయిన్లు.. ఫొటోస్ చూశారా?
పవిత్ర శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ ఇళ్లల్లో పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ జంటగా వరలక్ష్మీ వ్రతం నిర్వహించి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
Updated on: Aug 24, 2025 | 4:32 PM

హీరో, హీరోయిన్లు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలది ప్రేమ వివాహం. మలుపు సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన వీరు షూటింగ్ టైమ్ లోనే ప్రేమలో పడ్డారు. ఈ మూవీ తర్వాత పలు చిత్రాల్లో కూడా జంటగా నటించారీ లవ్లీ కపుల్.

చాలా రోజుల పాటు ప్రేమలో మునిగి తేలిన ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ 2022లో పెద్దల అనుమతితో పెళ్లి పీటలెక్కారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారీ క్యూట్ కపుల్.

తాజాగా వీరిద్దరూ కలిసి వరలక్ష‍్మీ వ్రతం చేశారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఈ సందర్భంగా భర్తతో కలిసి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం, తదితర పూజాదికాలు నిర్వహించింది నిక్కీ గల్రానీ. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ ఫొటోల్లో ఆది- నిక్కీ జంట ఎంతో అందంగా కనిపించింది. ఈ క్రమంలోనే వీటిని చూసిన నెటిజన్లు 'చూడముచ్చటైన జంట' అంటూ ఆది దంపతులకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

కాగా పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించి ఆది పినిశెట్టి ఇటీవల మయసభ వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ను పలకరించాడు. సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ రిలీజైనప్పటి నుంచి టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.




