AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు ఫ్యాన్ అంటే అట్లుంటది.. గూస్‌‌బంప్స్‌ తెప్పిస్తున్న శ్రీకాంత్ ఓదెల ట్వీట్‌ !

చిరు ఫ్యాన్ అంటే అట్లుంటది.. గూస్‌‌బంప్స్‌ తెప్పిస్తున్న శ్రీకాంత్ ఓదెల ట్వీట్‌ !

Phani CH
|

Updated on: Aug 25, 2025 | 6:40 PM

Share

వన్స్‌ చిరంజీవి ఫ్యాన్.. ఫరెవర్ చిరు ఫ్యాన్ ! ఇది మెగాస్టార్ ఫ్యాన్స్‌ కాలర్ ఎగరేసి మరీ చెప్పే మాట. ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల. ఎందుకంటే.. చిన్నప్పుడే చిరు ఫ్యాన్స్‌గా మారిన ఈ స్టార్ డైరెక్టర్. ఆయన కారణంగానే సినిమాల్లోకి వచ్చాడు. ఇప్పుడు నేరుగా.. తన అభిమాన నటుడి మూవీనే డైరెక్ట్‌ చేయబోతున్నాడు. ఈ ఎగ్జైట్‌మెంట్‌తోనే చిరు బర్త్‌ డే రోజు.. ట్విట్టర్‌లో ఓ స్పెషల్ పోస్ట్ రాసేశాడు ఈ డైరెక్టర్.

ఈ లెటర్ ద్వారా తనలోని చిరు ఫ్యాన్‌గా తన ఫీలింగ్స్‌ను బయటపెట్టేశాడీ యువ దర్శకుడు. నువ్వు నా డెమీ గాడ్‌వి అంటూ.. తన ట్వీట్‌ మొదలెట్టిన శ్రీకాంత్ ఓదెల.. తను చెప్పలనుకున్న విషయాన్ని వివరంగా.. తన ట్వీట్లో రాసుకొచ్చాడు. ఫస్ట్ టైం తాను చిరుతో ఫోటో దిగి..దానిని తన తల్లికి చూపిస్తే.. ‘ఫస్ట్ టైం నువ్వు నవ్వుతున్నావ్‌ రా’ అన్నదని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. దటీజ్‌ మై డెఫినెషన్‌ ఆఫ్‌ చిరంజీవి… అంటూ రాసుకొచ్చాడు. ఏం చేస్తుందిరా నీ సినిమా అంటే.. నా లాంటి ఇంట్రోవర్ట్‌ గాడితో ఇంద్ర స్టెప్‌ చేయించగలదని.. సినిమా టికెట్లు కొనుక్కునే వాడితో.. సినిమా తీయించగలదని రాసుకొచ్చాడు. అంతేకాదు.. చిరంజీవి అంటే.. ‘జీవితకాలం ఆడే సినిమా’ అంటూ గూస్ బంప్స్ వచ్చేలా తన రాతతో తనో హార్డ్ కోర్ మెగా ఫ్యాన్‌ని చెప్పకనే చెప్పేశాడు. అంతేకాదు ఇప్పుడు చిరంజీవితో సినిమా అంటే… జీవితకాలం గుర్తుండిపోయేలా తీయడం తప్ప.. ఇంకో ఆప్షన్ లేదన్నాడు ఓదెల. పనిలో పనిగా..తన ట్వీట్‌ చివర్లో ఫ్యాన్స్‌కు ఓ అదిరిపోయే ప్రామిస్ కూడా చేశారు ఓదెల. స్క్రీన్ మీద చిరును మిస్‌ అవుతున్నానని.. తన ట్వీట్లో రాసుకొస్తూనే… తాను మిస్‌ అయిన చిరును తిరిగి తీసుకొస్తా అంటూ రాసుకొచ్చాడు. ఇది తన కోసం తాను చేస్తున్న సినిమా అని.. తనలాంటి ప్రతి చిరు అభిమాని కోసం తీస్తున్న సినిమా అని ఓదెల తన ట్వీట్లో రాసుకొచ్చాడు. ఇట్స్‌ ఏ బ్లడ్ ప్రామిస్ అంటూ తన ట్వీట్లో కోట్ చేశాడు. అయితే ఇప్పుడీ చిరు ఫ్యాన్ చేసిన ఈ ట్వీటు మెగా సర్కిల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జక్కన్న మెలిక ఇక.. కేమెరాన్ ఒప్పుకోక తప్పదుగా..

పది.. పాతిక కాదు.. లక్షల్లో సంపాదన.. పూసలమ్ముకునే బేబీ నయా దందా…!

బోటు కడిగేందుకు నదిలో దిగిన మహిళ.. నీటిలో కనిపించింది చూసి షాక్

కోర్టులో బియ్యం చల్లిన వ్యక్తి “చేతబడి”గా అనుమానం