పది.. పాతిక కాదు.. లక్షల్లో సంపాదన.. పూసలమ్ముకునే బేబీ నయా దందా…!
మహాకుంబ్ లో పూల దండలు అమ్మిన మోనాలిసా తన అందంతో రాత్రికి రాత్రే ఫేమస్ అయింది. ఆ సమయంలో కొందరు ఫొటో గ్రాఫర్లు తీసిన మోనాలిసా వీడియోలు, ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఒకప్పుడు రోడ్డు మీద పూసల దండలమ్ముతూ పేదరికంలో జీవించిన మోనాలిసా జాతకం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మ్యూజిక్ వీడియోలు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా బాగా సంపాదిస్తోంది.
ఇక సోషల్ మీడియాలోనూ మోనాలిసా యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తోంది. దీంతో నెట్టింట ఈ ముద్దుగుమ్మకు రోజు రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. మోనాలిసా తొలి మ్యూజిక్ వీడియో ఇటీవలే విడుదలైంది. ఇందులో ఆమె నటుడు ఉత్కర్ష్ సింగ్ మోనాలిసాతో కలిసి నటించింది. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక మ్యూజిక్ వీడియో హిట్ అయిన తర్వాత మోనాలిసా బ్రాండ్ ప్రమోషన్లోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పుడీ అందాల తార పలు బ్రాండ్లకు ప్రమోషన్లు కూడా చేస్తోంది. ఇందుకు గానూ ఒక్కో యాడ్ కోసం లక్షల రూపాయలు తీసుకుంటోందని సమాచారం. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మోనాలిసా తన ఆదాయం గురించి రివీల్ చేసింది. మహాకుంభమేళా, గంగమ్మ తల్లి దయతో తనకు కొంచెం డబ్బు వస్తోంది. అంతేకానీ చాలా మంది అనుకుంటున్నట్లు తాను కోట్లు సంపాదించడం లేదంటూ చెప్పింది. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. ఇప్పుడు మోనాలిసా అందం గురించి ప్రతి చోటా చర్చ జరుగుతోంది. ఆమె ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు మోనాలిసా కష్టపడి పనిచేసే అమ్మాయి అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు మోనాలిసా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో నిత్యం తన ఫోటోలు అండ్ వీడియోలను పోస్ట్ చేస్తోంది.దాంతో పాటే యాడ్స్, డీఎమ్స్తో రెండు చూతులా సంపాదిస్తూ.. తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని అమాంతం పెంచుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బోటు కడిగేందుకు నదిలో దిగిన మహిళ.. నీటిలో కనిపించింది చూసి షాక్
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

