Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో జాలీ జాలీగా టాలీవుడ్ సినీ ప్రముఖులు.. ఫొటోస్ వైరల్.. ఎందుకు కలిశారో తెలుసా?
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. కె.రాఘవేంద్రరావు శ్రీకాంత్, అలీ, బ్రహ్మాజీ, శివాజీ రాజా, శివాజీ, కృష్ణవంశీ, , రాజా రవీంద్ర, బీవీఎస్ రవి తదితర సినీ ప్రముఖులు బండ్ల గణేశ్ ఇంట్లో మెరిశారు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నిర్మించిన ఆయన ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలో సందడి చేస్తుంటారు. అలాగే సోషల్ మీడియాలోనూ సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంటారు. తాజాగా బండ్ల గణేశ్ ఇంట్లో పార్టీ జరిగింది. ఈ కార్యక్రమానికి అలీ, శ్రీకాంత్, బ్రహ్మాజీ, శివాజీ రాజా, శివాజీ, కృష్ణవంశీ, కె.రాఘవేంద్రరావు, రాజా రవీంద్ర, బీవీఎస్ రవి తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఫొటోలని బ్రహ్మాజీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ’30 ఇయర్స్ ఇండస్ట్రీ. పార్టీ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్యూ బండ్ల గణేశ్. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్‌తో సీనియర్ సిటిజన్స్.. కాదు కాదు సీనియర్ యాక్టర్స్’ అని ఫన్నీ క్యాప్షన్ కూడా పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా పాత తరం హీరో, హీరోయిన్లు ఏటా కచ్చితంగా కలుస్తున్నారు. రీ యూనియన్లు, గెట్ టు గెదర్ పార్టీల పేరుతో ఒకే చోట చేరి ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు బండ్ల గణేష్ ఇంట్లో పార్టీ కూడా దాదాపు ఇలాంటిదే. ఈ ఫొటోల్లోని చాలామంది ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారు. నటులుగా, నిర్మాతలుగా, దర్శకులుగా సత్తా చాటుతున్నారు.
బండ్ల గణేష్ ఇంట్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు..
&
30 years industry 😀❤️.. Thank you @ganeshbandla bro for hosting 🤗… young n dynamic directors with senior citizens .. typo error… senior actors 😜 pic.twitter.com/TrS4NCScee
— Brahmaji (@actorbrahmaji) August 24, 2025
nbsp;
కాగా ఇటీవలే గోవాలో ఇలాంటి రీ యూనియన్ పార్టీ జరిగింది. ఈ వేడుకలో అలనాటి అందాల తారలు మహేశ్వరి, సంఘవి, కావ్య రమేష్, సంగీత, సిమ్రన్, శ్వేత కొన్నూర్ మీనన్, శివ రంజని, ఊహ, కేఎస్ రవి కుమార్, శంకర్, లింగుసామి, మోహన్ రాజా, ప్రభుదేవా, శ్రీకాంత్, జగపతి బాబు ఈ రీ యూనియన్‌లో పాల్గొన్నారు.
గోవా రీ యూనియన్ పార్టీలో అలనాటి అందాల తారలు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








