Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun- Jr NTR: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమా.. కట్ చేస్తే ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్.. ఏ మూవీనో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇద్దరూ పాన్ ఇండియా హీరోలే. ఇద్దరికీ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ హీరోల సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను ఇట్టే బద్దలు కొడతాయి. అయితే అల్లు అర్జున్ వద్దన్న ఓ కథతో ఎన్టీఆర్ సినిమా చేశాడు. అదేంటంటే..

Allu Arjun- Jr NTR: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమా.. కట్ చేస్తే ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్.. ఏ మూవీనో తెలుసా?
Jr NTR, Allu Arjun
Basha Shek
|

Updated on: Aug 24, 2025 | 6:05 PM

Share

టాలీవుడ్ లోనే కాదు.. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా కథలు, సినిమాలు చేతులు మారడమన్నది కామన్. ఒక హీరో చేయాల్సి సినిమా వివిధ కారణాలతో వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఇక్కడ పరిపాటిగా జరుగుతూ ఉంటోంది. అలా చేతులు మారిన సినిమాలు ఒక్కోసారి బ్లాక బస్టర్ హిట్ అవ్వొచ్చు.. మరోసారి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల విషయంలో కూడా ఒకసారి ఇది జరిగింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ బాగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయిపోయాడు. అయితే ఈ సినిమా రిలీజైన వెంటనే ఓ స్టార్ డైరెక్టర్ తో తర్వాతి ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు బన్నీ. అల్లు అర్జున్ 21వ సినిమాగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కథ, స్క్రీన్ ప్లే కూడా సిద్దమైంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. కట్ చేస్తే.. అదే స్టార్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ మూవీని ప్రకటించాడు. అల్లు అర్జున్ సినిమాకు అనుకున్న నిర్మాతలనే తారక్ మూవీకి కూడా సెట్ చేశాడు. కట్ చేస్తే.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు మరో పాన్ ఇండియా హిట్ ఖాతాలో పడింది. ఈ సినిమా ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆ సినిమా ఏదో.. యస్.. ఆ మూవీ మరేదో కాదు దేవర.

ఇవి కూడా చదవండి

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనేనేను లాంటి బ్లాక్ బస్టర్లు తెరకెక్కించిన కొరటాల శివ ఆచార్య సినిమాతో మొదటి ఫ్లాప్ అందుకున్నాడు. దీని తర్వాత దేవరతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అయితే ఈ మధ్యలోనే అల్లు అర్జున్ తో ఓ మూవీని అనౌన్స్ చేశాడు కొరటాల శివ. పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.. కానీ ఎందుకో గానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఈ మూవీ కథతోనే కొరటాల శివ దేవర సినిమానుతీశాడని అంటారు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. దేవర సినిమా మాత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ కూడా రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.