19 ఏళ్ల వయసులో 34 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న హీరో.. విడాకుల కోసం పన్నెండేళ్లు పోరాటం.. చివరకు…
ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. ప్రస్తుతం సినీరంగంలో విడాకుల తర్వాత తమకంటే చిన్న వయసు ఉన్న తారలను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ మీకు తెలుసా.. 19 ఏళ్ల వయసులో తనకంటే 15 ఏళ్లు పెద్ద మహిళను ప్రేమించి.. పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు ఓ హీరో. కానీ వీరి బంధం ఎక్కువ కాలం సాగలేదు.

సినిమా ప్రపంచంలో అతడు పాపులర్ నటుడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు అతడి వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. అతడికి 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు దాదాపు 15 సంవత్సరాలు పెద్దదైన 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్ని నెలలకే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. డివోర్స్ కోసం ఆ నటుడు దాదాపు పన్నెండేళ్లు పోరాటం చేశారు. అతడు మరెవరో కాదండి.. బాలీవుడ్ నటుడు నసీరుద్ధీన్ షా. అతడికి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తనకంటే 15 ఏళ్లు పెద్దదైన పర్వీన్ మురాద్ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆమె వయసు 34 సంవత్సరాలు. ఇప్పుడు ఇదే విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఇవి కూడా చదవండి : గ్లామర్‌లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..
బాలీవుడ్‌షాదీస్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం… నసీరుద్ధీన్ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్న సమయంలో పర్వీన్ ను మొదటిసారి కలిశాడు. అప్పుడు అతనికి 19 సంవత్సరాలు. పర్వీన్ వయసు 34 సంవత్సారలు. అప్పటికే తన భర్తతో విడాకులు తీసుకున్న పర్వీన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1969లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఏడాదికే వీరికి హీబా అనే పాప జన్మించింది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. కొన్ని నెలలకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
విడాకుల సమయంలో పర్వీన్ కుటుంబానికి నసీరుద్ధీన్ షా భారీగా భరణం చెల్లించాల్సి వచ్చిందట. ఆ తర్వాత 1975లో థియేటర్‌లో పనిచేస్తున్నప్పుడు రత్న పాఠక్‌ను కలిశాడు. వారి స్నేహం ప్రేమగా మారింది. కానీ అప్పటికే పర్వీన్ తో విడాకుల కేసు కోర్టులో ఉంది. దీంతో వీరిద్దరు చాలా కాలంపాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. 1982లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి ఇమాద్ షా, వివాన్ షా ఇద్దరు అబ్బాయిలు జన్మించారు.
ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

Naseeruddin Shah New
ఇవి కూడా చదవండి : మహేష్ బాబుతో సూపర్ హిట్ మూవీ.. సినిమాలు వదిలేసి గూగుల్‌లో జాబ్.. ఇప్పుడు టాప్ కంపెనీకి CEOగా..



