Bobby Deol: ‘యానిమల్’ నటుడు బాబీ డియోల్ భార్య ఎవరో తెలుసా ?.. రూ.300 కోట్లకు యువరాణి.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..
బాలీవుడ్ స్టార్ రణభీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 900 కోట్లు రాబట్టింది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్ర పోషించగా.. ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ మూవీలో అటు సౌత్ ఇండియాలోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు నటుడు బాబీ డియోల్. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అదరగొట్టేశాడు. ముఖ్యంగా జమల్ కుడు పాటతో ఫుల్ ఫేమస్ అయ్యాడు బాబీ..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ రణభీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 900 కోట్లు రాబట్టింది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్ర పోషించగా.. ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ మూవీలో అటు సౌత్ ఇండియాలోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు నటుడు బాబీ డియోల్. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అదరగొట్టేశాడు. ముఖ్యంగా జమల్ కుడు పాటతో ఫుల్ ఫేమస్ అయ్యాడు బాబీ.. ఇంతకీ అతడు ఎవరు ?.. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా ?.. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కుమారుడే బాబీ డియోల్. ఒకప్పుడు హీరోగా బీటౌన్ అరంగేట్రం చేసిన అతను.. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్… ప్రతినాయకుడి పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇక ఇటీవలే విజయాన్ని అందుకున్న యానిమల్ సినిమా కోసం ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికం తీసుకున్నాడని టాక్.
ఇదిలా ఉంటే.. బాబీ డియోల్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. 1996లో బాబీ తాన్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఆర్యమాన్ డియోల్, ధరమ్ డియోల్. ప్రస్తుతం ముంబైలో దాదాపు రూ. 6 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లాలో నివసిస్తున్నారు. 2010లో మరణించిన పారిశ్రామికవేత్త దేవేంద్ర అహుజా ముద్దుల కూతురే తాన్య. దేవేంద్ర అహుజా తన కుమార్తెకు రూ. 300 కోట్ల ఆస్తిని ఇచ్చాడని వార్తలు వచ్చాయి. తాన్య కూడా ఒక పారిశ్రామికవేత్త. ఆమె ఇంటీరియర్ డిజైనింగ్ చేసింది. అలాగే సొంతంగా ఫర్నిషింగ్ స్టోర్ కలిగి ఉంది. తాన్య ఆస్తి రూ. 300 కోట్లు. ఇక బాడీ డియోల్ ఆస్తి రూ. 66 కోట్లు.
నటుడు సంఘి పాండే ఇంట్లో ఏర్పాటు చేసిన ఓ పార్టీలో మొదటిసారి బాబీ డియోల్ పరిచయమయ్యాడని గతంలో తాన్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అక్కడే తనతోపాటు కార్డ్స్ ఆడాడని.. తనతో పోటీ పడి ఓడిపోయాడని..దీంతో బయట డిన్నర్ వెళ్దామని పదే పదే చెప్పాడని తెలిపింది. ఆ తర్వాత తన పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. వీరి పెళ్లి ఇరు కుటుంబసభ్యులు అంగీకరించడంతో 1996లో వివాహం జరిగినట్లు తెలిపారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




